ETV Bharat / city

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులకు శ్రేణులు కేటాయించిన ప్రభుత్వం - ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులకు శ్రేణులు కేటాయించిన ప్రభుత్వం

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన అనుసరించి... ప్రభుత్వం శ్రేణులు కేటాయించింది. ఆసుపత్రులు తప్పనిసరిగా ఎన్​ఎబిహెచ్ గుర్తింపు పొందాలని.. కాలపరిమితి విధిస్తోంది. రోగుల రద్దీ ఎక్కువుగా ఉండే ఆసుపత్రుల్లో... 24 గంటలూ ఆరోగ్యమిత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులకు శ్రేణులు కేటాయించిన ప్రభుత్వం

author img

By

Published : Dec 6, 2020, 8:24 AM IST

ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోని ఆస్పత్రులు 'నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్ ఫర్‌ హాస్పిటల్స్ అండ్‌ హెల్త్‌ కేర్‌- 'ఎన్​ఎబిహెచ్' గుర్తింపు పొందేందుకు ప్రభుత్వం కాలపరిమితి పెంచింది. ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, చికిత్స తీరు ఆధారంగా.... శ్రేణులు కేటాయించింది. వీటి ప్రాతిపదికన... తప్పనిసరిగా ఎన్​ఎబిహెచ్ నుంచి గుర్తింపు పొందాలని కాలపరిమితి విధిస్తోంది. తగిన ప్రమాణాల ఆధారంగా పనిచేస్తేనే ఆసుపత్రులకు గుర్తింపు లభిస్తోంది. ఇందువల్ల రోగులకు మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ గుర్తింపు లభిస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి అదనంగా 2 శాతం చెల్లిస్తారు.

ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని.... వంద మార్కులతో ప్రశ్నావళి రూపొందించారు. ఆపరేషన్‌ థియేటర్‌, అక్కడున్న సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా మార్కులు కేటాయించారు. 90 శాతం మార్కులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులకు ఎ+ శ్రేణి కేటాయించారు. ఎ శ్రేణిలో 302, బి శ్రేణిలో 107 ఆసుపత్రులున్నాయి. 278 ప్రైవేటు ఆసుపత్రులు దంతవైద్యం అందిస్తున్నాయి. ఇందులో 114 ఎ+, 127 ఎ, 37 ఆసుపత్రులు బి శ్రేణిలో ఉన్నాయి. మొత్తంగా ఆరోగ్యశ్రీ పరిధిలో 529 ప్రైవేటు ఆసుపత్రులు, 278 దంత వైద్యశాలలు ఉన్నాయని.. వైద్యారోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోని 31 ఆసుపత్రులకు ఇప్పటికే ఎన్​ఎబిహెచ్ గుర్తింపు ఉంది. ఎ+ శ్రేణిలో ఉన్న ఆసుపత్రులకు ఏడాదిలోగా, ఎ శ్రేణిలోని ఆసుపత్రులు ఏడాదిన్నరలోగా గుర్తింపు పొందాలని షరతు విధించారు. బి శ్రేణిలోని ఆసుపత్రులు 6 నెలల్లోగా.... ఎ గ్రేడ్‌ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ కావాలి. అక్కడి నుంచి ఏడాదిన్నరలోపు తప్పనిసరిగా ఎన్​ఎబిహెచ్ గుర్తింపు పొందాలి.

ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో 80 ప్రభుత్వాసుపత్రులూ ఉన్నాయి. వీటిలో 7 ఎ+, 38 ఎ, 35 బి శ్రేణిలోకి వచ్చాయి. దంత వైద్య చికిత్సను అందించే ప్రభుత్వాసుపత్రులు ఐదింటిలో...... 4బి, ఒకటి ఎ శ్రేణిలో ఉంది. వీటికీ ప్రత్యేక గుర్తింపు విషయంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల రోజువారీ నాణ్యత ప్రమాణాలను బేరీజు వేసేందుకు... రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించి 50 పాయింట్లు, ఐవీఆర్​ఎస్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా 25 పాయింట్లు....., ఆరోగ్య మిత్ర ద్వారా ఆసుపత్రి పనితీరును మదించి 25 పాయింట్లు వేస్తున్నారు. వీటి వల్ల ఆసుపత్రులు రోగుల పట్ల మరింత బాధ్యతగా వ్యవరించేందుకు వీలు ఏర్పడిందని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో డాక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

ప్రతి ఆసుపత్రిలోనూ తప్పనిసరిగా ఆరోగ్య మిత్ర ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగుల రద్దీ ఎక్కువుగా ఉండే ఆసుపత్రుల్లో... 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు... అదనంగా 660 మంది ఆరోగ్యమిత్రలు, 55 మంది టీం లీడర్ల నియామకాలను చేపట్టారు. వారి పనితీరు పర్యవేక్షణ, సమన్వయం కోసం ఆసుపత్రుల్లోని హెల్ప్‌ డెస్కుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత.. రంగంలోకి వైద్య బృందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.