ETV Bharat / city

పథకాలు ఒకేసారి అమలు చేయాల్సిరావడంతో ఉక్కిరిబిక్కిరి

ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంటి నుంచి బయటకు రావడమంటేనే సాహసంతో కూడుకున్నది.. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కృషి చేస్తూనే మరోవైపు వివిధ పథకాల అమల్లో చురుగ్గా పాల్గొనాల్సి పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో పలువురు కొవిడ్‌ బారినపడుతున్నారు. ప్రస్తుత వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కత్తి మీద సాములా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.

government employees
government employees
author img

By

Published : Aug 5, 2020, 1:13 PM IST

పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్లాట్ల సరిహద్దులు పక్కాగా ఉండాలి. లబ్ధిదారుల వివరాలు నమోదులో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు.. - మండల అధికారులకు జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు

రేషన్‌ కార్డుల ఈకేవైసీ మంగళవారం పూర్తి చేయాల్సిందే.. ఒక్కరోజులోనే ఇంటింటికి తిరిగి తొలగింపులు వంటివి చేపట్టండి.. - జిల్లా ఉన్నతాధికారి సూచనలతో గ్రామ సచివాలయ సిబ్బందికి సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోల ఆదేశం

ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంటి నుంచి బయటకు రావడమంటేనే సాహసంతో కూడుకున్నది.. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కృషి చేస్తూనే మరోవైపు వివిధ పథకాల అమల్లో చురుగ్గా పాల్గొనాల్సి పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో పలువురు కొవిడ్‌ బారినపడుతున్నారు. ప్రస్తుత వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కత్తి మీద సాములా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.

ఊరూవాడా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 39వేల మంది, 25 వేల మంది ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 10 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. చిలకలూరిపేటలో అత్యవసరంగా సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ విభాగాలలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. చిలకలూరిపేట రూరల్‌, అర్బన్‌ సర్కిళ్లలో ప్రధాన అధికారులతో పాటు సిబ్బంది, హోం గార్డులు, వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆసుపత్రుల్లో చేరారు. దాచేపల్లి తహశీల్దారుగా పని చేస్తున్న లెవీ కరోనా నుంచి కోలుకొని ఇటీవల విధులకు హాజరయ్యారు. బాపట్ల, నరసరావుపేట తహశీల్దారు కార్యాలయాల్లో పలువురు వైరస్‌ బారినపడటంతో కొద్ది రోజులు మూసేశారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం తమకు సవాలుగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు రోజూ వీడియో కాన్ఫరెన్స్‌, సెల్‌ఫోన్‌ ద్వారా లక్ష్యాలు విధించడంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నామని అంటున్నారు. కరోనా తీవ్రత ఉన్నందున క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులున్నాయని, పనులు అనుకున్నమేర ముందుకు సాగడం లేదని వివరిస్తున్నారు.

అన్ని శాఖలకూ లక్ష్యాల విధింపు

మంగళవారం జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల ఈకేవైసీ చేపట్టారు. సచివాలయ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఓవైపు కొవిడ్‌ కేసులు నమోదైతే వారి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. మరోవైపు వివిధ దరఖాస్తుల పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలి. ప్రస్తుతం వైరస్‌ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది కష్టాలు అంతా ఇంతా కాదు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పనులు ప్రతిచోట ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలలో పనులు పూర్తిచేయాలని లక్ష్యం విధించారు. పనులు పూర్తి చేసే విషయమై ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టాలి. పొలాలకు వెళ్తే రైతులు అందుబాటులో ఉండని పరిస్థితి. సాంకేతిక సమస్యలు తోడవడంతో అవస్థలు తప్పడం లేదు. పొదుపు మహిళలకు రుణమాఫీ, వైఎస్సార్‌ చేయూత పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఈక్రమంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే మాదిరి పలు ప్రభుత్వ పథకాలు అమల్లో భాగంగా లక్ష్యం చేరేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు.

ఎవరైనా బాధితులైతే.. భారం మోయాల్సిందే

కరోనా సోకిన ఉద్యోగులు సెలవులు పెట్టి చికిత్స పొందుతుండటంతో ఆ భారం మిగిలిన ఉద్యోగులపై పడుతోంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్న వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచాలి. అలా చేస్తే ప్రభుత్వ కార్యాలయాన్నీ ఖాళీ అయిపోతాయని ఉద్యోగులే చెబుతున్నారు. ఇటీవల ఓ ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయనతో సంబంధం ఉన్న మిగిలిన ఉద్యోగులందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని సదరు కార్యాలయ అధికారి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాజిటివ్‌ వచ్చిన పది రోజుల వరకు కిట్‌లు లేవంటూ జాప్యం జరిగింది. ఈలోపే సదరు కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా ప్రజలతో పాటు వివిధ శాఖల ఉద్యోగులను కలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: రాజధాని విషయంలో కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.