ETV Bharat / city

సత్ఫలితాలిస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పథకం

author img

By

Published : Aug 18, 2022, 12:27 PM IST

Telangana Diagnostics తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పథకం విజయవంతమైంది. దీనికింద ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌ల ద్వారా జులై 31, 2022 వరకు సుమారు 30 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలే లక్ష్యంగా మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.

Telangana Diagnostics
తెలంగాణ డయాగ్నస్టిక్స్‌

Telangana Diagnostics పేద రోగులు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్‌’ పథకం విజయవంతమైందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. దీనికింద ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌ల ద్వారా జులై 31, 2022 వరకు సుమారు 30 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే నిర్ధారణ పరీక్షల సంఖ్య కోటి దాటిందని వెల్లడించింది. వీటి విలువను లెక్కిస్తే రూ.320.7 కోట్లుగా ఉంటుందని వివరించింది. ఆ మేరకు పేద రోగులకు డబ్బులు ఆదా అయినట్లు విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలే లక్ష్యంగా మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.

‘తెలంగాణ డయాగ్నస్టిక్స్‌’ ప్రస్థానం..: ప్రస్తుతం వైద్యంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. జ్వరానికి రక్త పరీక్షలు చేయించుకుంటే.. కనీసం రూ.1000-1,500 వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద పరీక్షలైతే రూ.వేలకు వేలు జేబుకు చిల్లు పడడడం ఖాయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో పేదలు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్‌’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పేద రోగుల పాలిట వరంలా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ సదుపాయాలను మరింత విస్తరించాలని నిర్ణయించి గత నాలుగున్నరేళ్లలో మరో 19 డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలను నెలకొల్పింది. వీటిల్లో ప్రధానంగా రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌, సీటీ, ఎంఆర్‌ఐ వంటి నిర్ధారణ పరీక్షల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 రేడియాలజీ హబ్స్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని.. రానున్న రోజుల్లో మరో 19 రేడియాలజీ హబ్స్‌ను, 13 రక్త, మల, మూత్ర పరీక్షలను నిర్వహించే ప్రయోగశాలలను నెలకొల్పడానికి ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.

150 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగానే..
ప్రయోగశాలల్లో 3 పరికరాలు(ఫుల్లీ ఆటోమెటేడ్‌ మిషన్స్‌)ను నెలకొల్పారు. వీటి ద్వారా ప్రధానంగా 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలు చేస్తుండగా.. తద్వారా వీటికి అనుబంధంగా ఉండే సుమారు 150 రకాలకుపైగా పరీక్షలు ఉచితంగా పొందే అవకాశం ఏర్పడింది. ప్రయోగశాలలు నెలకొల్పుతున్నా.. నిర్ధారణ పరీక్షల ఫలితాలను 24 గంటల్లోగా ఇస్తేనే వాటికి ఫలితముంటుంది. చాలాచోట్ల 48 గంటలు గడిస్తే గానీ ఫలితాలు వెల్లడవడం లేదనే విమర్శలున్నాయి.

హైదరాబాద్‌లో సేవలందిస్తున్న రేడియాలజీ హబ్స్‌
1.అంబర్‌పేట 2.లాలాపేట 3.సీతాఫల్‌మండి 4.శ్రీరాంనగర్‌ 5.బార్కాస్‌ 6.జంగమ్‌మెట్‌ 7.పానీపూరా 8.పురానాపుల్‌ 9.హయత్‌నగర్‌ 10.రాజేంద్రనగర్‌ 11.పటాన్‌చెరు 12.నార్సింగి 13.శేరిలింగంపల్లి 14.మలక్‌పేట 15.అమీర్‌పేట 16.ఉప్పల్‌ 17.కుషాయిగూడ 18.కూకట్‌పల్లి 19.గోల్కొండ 20.ఆల్వాల్‌ కొత్తగా 19 చోట్ల నెలకొల్పనున్న రేడియాలజీ హబ్స్‌ 1.మహబూబ్‌నగర్‌ 2.జోగులాంబ గద్వాల 3.వికారాబాద్‌ 4.నల్గొండ 5.మెదక్‌ 6.సంగారెడ్డి 7.సిద్దిపేట 8.నిజామాబాద్‌ 9.నిర్మల్‌ 10.ములుగు 11.జనగాం 12.ఖమ్మం 13.భద్రాద్రి కొత్తగూడెం 14.మహబూబాబాద్‌ 15.కరీంనగర్‌ 16.జగిత్యాల 17.రాజన్న సిరిసిల్ల 18.కుమురంభీం ఆసిఫాబాద్‌ 19.ఆదిలాబాద్‌

...
...

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.