ETV Bharat / city

Vehicle Tax: కొత్త వాహనాలపై పన్ను భారం - government will increase the tax burden on new vehicles

కొత్త వాహనాలు కొనేవారికి జీవితపన్ను భారాన్ని ప్రభుత్వం మరింత పెంచింది. వాహనం ధరను బట్టి ఈ పన్ను వర్తింపజేసేలా సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో బైకులకు 3%, రూ.10 లక్షలు దాటిన కార్లకు 3-4% జీవితపన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. హరిత పన్ను రూపంలో పాత వాహనదారుల జేబులకు చిల్లుపడనుంది. ఆటోలు మినహా మిగిలిన అన్ని రకాల పాత వాహనాలకు హరిత పన్ను భారీగా పెంచారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

కొత్త వాహనాలపై పన్ను భారం
కొత్త వాహనాలపై పన్ను భారం
author img

By

Published : Nov 25, 2021, 1:51 PM IST

కొత్త వాహనాలు కొనేవారికి జీవితపన్ను భారాన్ని ప్రభుత్వం మరింత పెంచింది. వాహనం ధరను బట్టి ఈ పన్ను వర్తింపజేసేలా సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో బైకులకు 3%, రూ.10 లక్షలు దాటిన కార్లకు 3-4% జీవితపన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. హరిత పన్ను రూపంలో పాత వాహనదారుల జేబులకు చిల్లుపడనుంది. ఆటోలు మినహా మిగిలిన అన్ని రకాల పాత వాహనాలకు హరిత పన్ను భారీగా పెంచారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. వీటి పెంపు ద్వారా కొత్త వాహనాల కొనుగోలుదారులు, పాత వాహనదారులపై ఏటా రూ.409 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదాయం పొందనుంది.

* ఇప్పటివరకు కొత్త ద్విచక్ర వాహనాల్లో 60 సీసీలోపు, ఆపైన ఉన్నవాటికి 9% జీవితపన్ను ఉండేది. ఇపుడు వీటిలో రూ.50 వేలలోపు బైకులకు 9%, రూ.50 వేలు దాటితే 12% జీవిత పన్ను విధించారు. వికలాంగులు బైకులకు ఇన్‌వ్యాలీడ్‌ క్యారేజ్‌ ఏర్పాటుచేసుకుంటే గతంలో వసూలు చేసే అదనపు మొత్తాన్ని తొలగించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, మన రాష్ట్రానికి బదిలీ చేసుకునే బైకులకు.. వాటికి తొలుత రిజిస్ట్రేషన్‌ జరిగిన ఏడాది బట్టి 11 శ్లాబుల్లో వసూలుచేసే జీవిత పన్నులో మార్పులు చేయలేదు.

* రవాణేతర కేటగిరీలో కార్లు, జీపులు వంటి నాలుగు చక్రాల వాహనాలకు గతంలో.. రూ.10లక్షలోపు వాటికి 12%, అంతకంటే ఎక్కువ ధర అయితే 14% జీవితపన్ను ఉండేది. ఇప్పుడు వాటిని నాలుగు శ్లాబులు చేశారు. రూ.5 లక్షలలోపు వాటికి 13%, రూ.5-10 లక్షల మధ్య అయితే 14%, రూ.10-20 లక్షలైతే 17%, రూ.20 లక్షలు దాటితే 18% జీవితపన్ను విధించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, ఇక్కడకు బదిలీ చేస్తే తొలుత రిజిస్ట్రేషన్‌ జరిగిన ఏడాది బట్టి, వాహన ధర ఆధారంగా జీవితపన్ను పెంచారు.

* రెండో వాహన పన్నును తొలగించారు.

అమ్మో హరిత పన్ను..

సరకు రవాణా, ప్రయాణికుల రవాణా వాహనాలకు ఏడేళ్ల తర్వాత నుంచి ఏటా హరిత పన్ను రూ.200 వసూలు చేస్తుండగా.. దాన్ని పెంచారు. సరకు రవాణా వాహనాల్లో 7-10 ఏళ్ల వాటికి ఏడాదికి త్రైమాసిక పన్ను (దాదాపు రూ.8,500-10 వేలు) విలువలో సగం, 10-12 ఏళ్ల వాటికి ఏడాదికి త్రైమాసిక పన్నుకు సమాన విలువ, 12 ఏళ్లు పైబడిన వాటికి ఏడాదికి త్రైమాసిక పన్నుకు రెట్టింపు హరిత పన్నుగా చెల్లించాలి.

* ప్రయాణికుల రవాణా వాహనాల్లో 7-10 ఏళ్ల వాటికి ఏడాదికి రూ.4 వేలు, 10-12 ఏళ్ల వాటికి రూ.5 వేలు, 12 ఏళ్లు పైబడిన వాటికి రూ.6 వేలు చెల్లించాలి.

* 15 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనాలకు.. అయిదేళ్లకు హరితపన్ను ఇప్పటివరకు రూ.250 ఉండగా, దీనిని రూ.2వేలకు పెంచారు. 20 ఏళ్లు దాటిన వాహనాలకు మరో అయిదేళ్లకు హరిత పన్ను రూ.5 వేలు.

* 15 ఏళ్లు దాటిన కార్లకు.. అయిదేళ్లకు హరితపన్ను రూ.500 ఉండగా, దీనికి రూ.5 వేలకు పెంచారు. 20 ఏళ్లు దాటితే మరో అయిదేళ్లకు రూ.10 వేలు చెల్లించాలి.

* ప్రయాణికుల ఆటోలు, సరకు రవాణా ఆటోలకు హరిత పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎల్పీజీ, సీఎన్‌జీ, బ్యాటరీ, సౌరవిద్యుత్‌తో నడిచే వాహనాలకు హరితపన్ను వర్తించదు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, ట్రాలర్లకూ ఈ పన్ను వర్తించదు.

కేంద్ర ఆదేశాల మేరకే: పేర్ని నాని

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధిక కర్బనాలను విడుదలచేసే పాత వాహనాలపై హరిత పన్ను విధించాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త బిల్లులోని అంశాలను శాసనసభలో మంత్రి వివరిస్తుండగా సీఎం జోక్యం చేసుకుని పలు సూచనలు చేశారు. తర్వాత సచివాలయం ఆవరణలో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకే ఈ సవరణ చేస్తున్నాం. ఇప్పటివరకు బాగా పాతబడిన వాహనాలపై ఏడాదికి రూ.200-250 వసూలు జరిగేది. దాన్ని పెంచుతూ సవరణ చేస్తున్నాం. కొంతమంది అత్యుత్సాహపరులు జగన్‌రెడ్డి ఒక చేత్తో బటన్‌ నొక్కి మరో చేత్తో తిరిగి తీసుకుంటున్నారని చెప్పే అవకాశం ఉంది. అందుకే ఆటోలకు ఇది వర్తించదని స్పష్టం చేస్తున్నాం. కొత్త వాహనాల్లో రూ.10 లక్షలకు పైబడిన వాహనాలకే జీవిత పన్ను పెరుగుతుంది. లగ్జరీ వాహనాలకే 4% పెంపు వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.