ఎన్నికల కోడ్‌లో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉపయోగిస్తే కిలో మీటరుకు రూ. 38, డ్రైవర్‌కు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ.. పోలీసు అధికారుల నుంచి తనకు నోటీసు వచ్చిందని తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. నోటీసును చూసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. అసలు తాను బుల్లెట్ ప్రూఫ్ వాహనం అడగలేదని.. తనకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
అనేక మంది మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. వాళ్లందరూ డబ్బులు కడుతున్నారా అని ప్రశ్నించారు. మంత్రులకు కొత్త వాహనాలు ఇచ్చి.. ప్రమాదం పొంచి ఉన్న తనకేమో పాత వాహనం ఇచ్చారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి డబ్బులు చెల్లించాలనడం సరైందికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: