Gold Seized : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం తరలింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : కల్లూరులో దారుణం... మూడు నెలల పసికందును చంపి ఉరేసుకున్న తల్లి