ETV Bharat / city

ఇక నుంచి ఆ జీవోలు మాత్రమే వెబ్​సైట్​లో.. ప్రభుత్వం ఉత్తర్వు..

రాష్ట్ర ప్రభుత్వం జీవోల విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. గెజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురిస్తున్న ఏపీ ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లోనే ఇకపై జీవోలూ ఉంచుతామని పేర్కొంది. కానీ ఇదివరకటిలా జీవోలన్నీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనుకున్నవాటినే అప్‌లోడ్‌ చేస్తామని పేర్కొంది. వాటిలో అత్యవసరమనుకున్నవి వాటి ప్రాధాన్యాన్ని బట్టి, సాధారణ జీవోల్ని వారానికి ఒకసారి మాత్రమే ఈ-గెజిట్‌లో ఉంచుతామని తెలిపింది.

E-Gazette portal
E-Gazette portal
author img

By

Published : Sep 9, 2021, 7:20 AM IST

విధాన నిర్ణయాలు, బదిలీలు, నిధుల కేటాయింపులు, వ్యయాలు తదితర పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఉత్తర్వుల్ని ‘జీవోఐఆర్‌’ వెబ్‌సైట్‌లో ఉంచే విధానానికి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడం, కోర్టులో వ్యాజ్యాలు దాఖలవడంతో ఇప్పుడు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురిస్తున్న ఏపీ ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లోనే ఇకపై జీవోలూ ఉంచుతామని పేర్కొంది. కానీ ఇదివరకటిలా జీవోలన్నీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనుకున్నవాటినే అప్‌లోడ్‌ చేస్తామని పేర్కొంది. వాటిలో అత్యవసరమనుకున్నవి వాటి ప్రాధాన్యాన్ని బట్టి, సాధారణ జీవోల్ని వారానికి ఒకసారి మాత్రమే ఈ-గెజిట్‌లో ఉంచుతామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నం.100) జారీ చేశారు. ఈ జీవోను కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం గమనార్హం. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని కోర్టుకు చెప్పేందుకే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని వివిధ వర్గాలవారు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఏ జీవో అవసరమో, ఏది కాదో అధికారులు ఎలా నిర్ణయిస్తారని.. ఒకసారి జీవో ఇచ్చాక అది ‘పబ్లిక్‌ డాక్యుమెంట్‌’ అవుతుందని, బయట పెట్టాలా వద్దా అన్న విచక్షణాధికారం అధికారులకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

డిజిటల్‌ సంతకం లేదని..!
* జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలు ఉంచే విధానాన్ని రద్దు చేయడం, ఇప్పుడు ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన జీవోల్ని మాత్రమే ఉంచాలని నిర్ణయించుకోవడానికి కారణాలేంటో ప్రభుత్వం జీవో నంబర్‌ 100లో వివరించింది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఆఫీస్‌ మాన్యువల్‌, ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌, సమాచార హక్కు, ఐటీ, ఇతర చట్ట నిబంధనలకు లోబడి, సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును నెరవేర్చేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించాలనే జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలు ఉంచే విధానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.
* ‘జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఇది వరకు ఉంచే జీవోలపై అధికారుల సంతకం లేదా డిజిటల్‌ సంతకం ఉండేవి కాదు. అధికారిక గెజిట్‌ చట్టబద్ధమైన డాక్యుమెంట్‌ కాబట్టి, ఇకపై జీవోల్ని ఏపీ ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది. విస్తృత చర్చలు, పరిశోధన, కేంద్రం, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
* ‘ఇంటర్నెట్‌ సహా వివిధ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు సులువుగా తెలిసేలా, విస్తృతంగా వ్యాపించేలా అందుబాటులో ఉంచాలన్నది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4(2) 4(3)ల ఉద్దేశం. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రజలకు సమాచారం అందించే ఏకైక వేదికగా ఏపీ ఈ-గెజిట్‌ ఉంటుంది’ అని తెలిపింది.
* ప్రజలకు తెలియక్కర్లేని, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఉత్తర్వుల్ని ఈ-గెజిట్‌లో ఉంచబోమని, నేరుగా సంబంధిత అధికారులకే పంపిస్తామని తెలిపింది. వ్యక్తిగత గోప్యత ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఈ నిబంధన పెట్టామని పేర్కొంది. ఈ-గెజిట్‌లో ఉంచని ఉత్తర్వుల్ని సమాచార హక్కు చట్టం నిబంధనలకు లోబడి పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడించింది.
* ప్రజలకు సమాచారం మరింత మెరుగ్గా అందేలా చూసేందుకు, కావలసిన ఉత్తర్వుల్ని తేలిగ్గా వెతికి పట్టుకునేందుకు, మితిమీరిన సమాచార ఉరవడిని నియంత్రించేందుకు, ఉత్తర్వుల సమర్థ వర్గీకరణకు వీలు కల్పించేందుకు.. చిన్న చిన్న వ్యయాలకు సంబంధించిన, ప్రజాప్రయోజనం లేదనుకున్న జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచబోమని తెలిపింది. ఉదాహరణకు వైద్య ఖర్చుల రీయంబర్స్‌మెంట్‌, మెడికల్‌ లీవ్‌లు, ప్రభుత్వ వాహనాల డీజిలు ఖర్చులు, స్టేషనరీ కొనుగోళ్లు, ఎల్‌టీసీ, ఆర్జిత సెలవులు వంటి జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచబోమని స్పష్టం చేసింది.
*సెక్రటేరియేట్‌ ఆఫీస్‌ మాన్యువల్‌లో అత్యంత రహస్యం, రహస్యం, గోప్యమైనవిగా వర్గీకరించిన జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచబోమని వెల్లడించింది.

జీవో ఇచ్చేశాక విచక్షణేంటి?

ప్రభుత్వ నిర్ణయాల్లో వివాదాస్పదమైనవి, ప్రజలకు తెలిస్తే విమర్శలు వస్తాయనుకున్నవాటిని ‘విచక్షణ’ పేరుతో బహిరంగపరచకుండా ఉంచేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏదైనా అంశం ప్రభుత్వ పరిశీలనలోనో, చర్చల దశలోనో ఉన్నప్పుడు బయటకు పొక్కితే ఇబ్బంది అనుకోవచ్చు. నిర్ణయం తీసేసుకుని, జీవో కూడా ఇచ్చేశాక ఇంకా గోప్యత, విచక్షణాధికారం ఏంటి?’ అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 2008 నుంచి ప్రభుత్వం ప్రతి జీవోనూ జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది. అందువల్ల సమాచారం ఎక్కువైపోతోందని గానీ, కావలసిన జీవోను వెతికి పట్టుకోవడం కష్టమవుతోందని గానీ ఇప్పటివరకు ఫిర్యాదులు లేవు. నేరుగా ఆ వెబ్‌సైట్‌లో, కావలసిన విభాగంలోకి వెళ్లి.. జీవో నంబరు, తేదీ లేదా జీవోలోని ఏదైనా ఆంగ్ల పదంతో సులభంగా ‘సెర్చ్‌’ చేసి కావలసిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘కేంద్రం, కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నదానికంటే మనది మెరుగైన విధానం. అది వదిలేసి కేంద్రం ఏదో చేస్తోంది కాబట్టి, దాన్ని అనుసరిస్తున్నామనడం సాకు మాత్రమే. 2008 నుంచీ జీవోఐఆర్‌లో జీవోలు పెడుతున్నా.. అధికారుల సంతకంతో పెట్టాలని ఎవరూ అడగలేదు. అదే ఇబ్బంది అనుకుంటే.. వారి సంతకాలతోనే జీవోఐఆర్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చు కదా?’ అని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. తమకు కావలసినవారిని కీలక పోస్టుల్లో నియమించడం, అధికారుల బదిలీలు, ప్రభుత్వ కేసులు వాదిస్తున్న న్యాయవాదులకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం, మంత్రులు, అధికారులు, సలహాదారులకు ఇచ్చే భత్యాలు, వారు చేసే విదేశీ ప్రయాణాలు వంటి వివరాల్నీ వ్యక్తిగత సమాచారం పేరుతో గోప్యంగా ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమన్న విమర్శలు వస్తున్నాయి.

‘రహస్య’ జీవోలంటూ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సరికాదు

ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మూడు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జీవోలను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. గతంలో పేర్కొన్న వెబ్‌సైట్‌ స్థానంలో ఏపీఈగెజిట్‌ వెబ్‌సైట్లో జీవోలను ఉంచనున్నట్లు ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జీవోలను అత్యంత గోప్యం, గోప్యం, రహస్యం అని విభాగాలుగా వర్గీకరించిందన్నారు. అలాంటి జీవోలను వెబ్‌సైట్లో పెట్టబోమని పేర్కొందన్నారు. ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించారో స్పష్టత లేదన్నారు.

ఇదీ చదవండి: Lokesh tour: నేడు నరసరావుపేటలో నారా లోకేశ్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.