ETV Bharat / city

తెలంగాణ గవర్నర్​కు దక్కిన గ్లోబల్​ ఉమెన్​ ఆఫ్​ ఎక్సలెన్స్ అవార్డు

author img

By

Published : Mar 4, 2021, 7:23 PM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసైకి గ్లోబల్​ ఉమెన్​ ఆఫ్​ ఎక్సలెన్స్​- 2021 అవార్డు దక్కింది. సమాజ హితం కోసం సేవలు అందించినందుకు గానూ ఇచ్చే ఈ అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా 20 మహిళలు ఎంపిక కాగా.. అందులో అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలాహారిస్​తో పాటు గవర్నర్​ సౌందరరాజన్​ ఉన్నారు.

global women excellence-2021 award for governor tamilisai
తెలంగాణ గవర్నర్​కు దక్కిన గ్లోబల్​ ఉమెన్​ ఆఫ్​ ఎక్సలెన్స్ అవార్డు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ను అంతర్జాతీయ పురస్కారం వరించింది. తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021 అవార్డు వచ్చినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా... అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్, తెలంగాణ గవర్నర్​ తమిళిసైతో పాటు మరో 18 మంది మహిళలు ఎంపికయ్యారు.

సమాజ హితం కోసం సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ నెల 7న గవర్నల్​ తమిళిసై... అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. తమిళిసై ఇటీవలే పుదుచ్చెరి లెఫ్టినెంట్​ గవర్నర్​గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి : తిరుమలకు ఉప రాష్ట్రపతి..రేపు శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.