తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో లింగప్ప(65) కుటుంబం జీవిస్తోంది. కొడుకు, కోడలు, మనుమరాలితో లింగప్ప ఉంటున్నాడు. లింగప్పకు తొమ్మిదేళ్ల మనుమరాలు ఉంది. ఆ బాలిక నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా తనపై తాత లైంగికంగా దాడి చేస్తున్నాడని... తమ కూతురు చెప్పిందని, తల్లి ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది.
వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే...
తమకు తీరని అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని బాలిక తల్లి పోలీసులను వేడుకుంది. మామ లింగప్పపై చర్యలు తీసుకోవాలని కోరింది. జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలరాజు కేసు దర్యాప్తును ప్రారంభించారు. చిన్నారిపై లైంగికదాడి కేసు కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. వైద్య పరీక్షల్లో మాత్రం లైంగిక దాడి జరగలేదని తేలిందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
ఆస్తి తగాదాలే కారణమా?
లింగప్పకు ఆమె కొడుక్కి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టు సీఐ తెలిపారు. ఆ నేపథ్యంలోనే ఆమె మామపై ఆరోపణలు చేస్తుందా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. లింగప్పను సైతం వైద్య పరీక్షలకు పంపామని, రిపోర్టు వస్తే ఓ క్లారిటీ వస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.
ఇదీ చదవండి :