ETV Bharat / city

మైలురాళ్లు చాలానే... చేరాల్సిన తీరాలు ఇంకెన్నో..! - womens day news

అలుపెరుగని పరుగులో దాటొచ్చిన మైలురాళ్లు చాలానే ఉన్నా... చేరాల్సిన తీరాలూ ఇంకెన్నో ఉన్నాయి. సరిహద్దుల్లో తుపాకి పట్టినా... శాస్త్రవేత్తలై ఆవిష్కరణలు చేసినా... వ్యాపార దిగ్గజాలుగా వెలుగొందుతున్నా... వారి సంఖ్య తక్కువే. ఎదుగుతున్న మహిళా లోకాన్ని వెనక్కిలాగే పోకడలు ఇంకా ఈ సమాజంలో మిగిలే ఉన్నాయి. అందుకు నిదర్శనమే ఈ లెక్కలు... ఈ అవరోధాలను అధిగమించిన రోజునే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది.

woemns day special
woemns day special
author img

By

Published : Mar 8, 2020, 2:31 PM IST

భారత్‌లో స్త్రీలు ఇంటి పని రోజుకు ఆరు గంటలపాటు చేస్తుంటే పురుషులు మాత్రం ఒక్క గంటే చేస్తున్నారు. అదే అమెరికాలో అయితే పురుషులు నాలుగు గంటలు చేస్తుంటే స్త్రీలు రెండున్నర గంటలు చేస్తున్నారు. ఇద్దరూ సమానంగా పనిచేసే దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు! ప్రపంచం మొత్తం మీద చూస్తే... పనిచేసే వారిలో 75 శాతం మహిళలే! అంటే ఇల్లు, ఆఫీసు, వ్యాపారం, పిల్లల పనులు... ఇలా అన్నీ కలిపి చూసుకుంటే ఎక్కువగా పని చేస్తున్నది వారే. మొత్తం పని గంటల్లో మూడింట రెండొంతులు స్త్రీలే చేస్తున్నారు.

  • 39 దేశాల్లో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి కూతురు కంటే కొడుకుకే ఎక్కువగా చెందాలని చట్టాలు చెబుతున్నాయి.
  • భార్యలు ఉద్యోగం చేయకుండా భర్తలు అడ్డుకునే హక్కును 18 దేశాల్లో ప్రభుత్వమే అధికారికంగా కల్పిస్తోంది.
  • ఇండియాలో పురుషుల అక్షరాస్యత శాతం 82.14 ఉండగా, స్త్రీలలో ఇది కేవలం 65.46 శాతం.
  • తక్కువ ఆదాయం ఉండే దేశాల్లో - ప్రతి వంద మంది అబ్బాయిలకు 55 మంది అమ్మాయిలు మాత్రమే చదువుకోగలుగుతున్నారు.
  • స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేలా 113 దేశాల్లో అసలు చట్టాలే లేవు!
  • పనిలో ముందున్నా స్త్రీల ఆదాయం తక్కువ. పురుషుల ఆదాయంతో పోలిస్తే అతివలు సంపాదించేది 60 నుంచి 75 శాతం మాత్రమే

ఐక్యరాజ్యసమితి లెక్కలు చూస్తే

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న బాలికలూ, మహిళల్లో... ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులు లేదా గృహహింసకు గురవుతున్నారట. క్యాన్సర్‌, యాక్సిడెంట్లు, యుద్ధాల వంటి వాటివల్ల మృత్యువాత పడేవారికంటే పురుషుల దౌష్ట్యాల కారణంగా చనిపోయే ఆడవాళ్ళ సంఖ్యే అధికం.

  • ప్రపంచవ్యాప్తంగా రోజుకు 39 వేల మందికి పైగానే బాల్యవివాహాలకు బలవుతున్నారు!
  • 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో పెళ్లయి ఒక బిడ్డ ఉన్న 15 ఏళ్లలోపు బాలికలు 45 లక్షల మంది ఉన్నారు. ఇందులో 70 శాతం మందికి ఇద్దరు పిల్లలున్నారు!
  • పేదరికంలో మగ్గుతూ ఆకలితో అలమటించే వారిలో 60 శాతం మంది స్త్రీలూ పిల్లలే!
  • వివిధ దేశాల పార్లమెంట్‌ సభ్యుల్లో మహిళలు 21 శాతం మాత్రమే! కేబినెట్‌ మినిస్టర్లయితే కేవలం 8శాతమే ఉన్నారు.
  • ప్రభుత్వాల్లోనైనా వ్యాపార సంస్థల్లోనైనా నిర్ణయాత్మక స్థానాల్లో 30 శాతం స్త్రీలు ఉండాలంటూ ఐక్యరాజ్యసమితి చేసిన సూచనను కేవలం 46 దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం లెక్కల ప్రకారం, గత వందేళ్లలో వచ్చిన మార్పులను గమనిస్తే... ప్రపంచం పూర్తిస్థాయి స్త్రీ పురుష సమానత్వం సాధించడానికి ఇంకో 108 ఏళ్లు పడుతుందట!

ఇదీ చదవండి : రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న మహిళా బైక్ రైడర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.