ETV Bharat / city

Gang Rape news: మద్యం తాగించి.. ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం - gang rape at nizamabad

యువతిపై సామూహిక అత్యాచారం
యువతిపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Sep 29, 2021, 8:51 AM IST

Updated : Sep 29, 2021, 10:03 AM IST

08:49 September 29

నిజామాబాద్​లో యువతిపై సామూహిక అత్యాచారం

  కామాంధుల పైశాచికత్వానికి వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మహిళలు (rape victims news) బలవుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే రక్షణనివ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి... వారి పశువాంఛను తీర్చుకునేందుకు యత్నిస్తున్నారు. చిన్నారులు, బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుస అత్యాచార ఘటనలు (rape incidents), మానవ మృగాల ఆకృత్యాలకు అదుపు లేకుండా పోవడాన్ని చాటుతున్నాయి. తాజాగా ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్​లో యువతిపై నలుగురు అత్యాచారానికి (gang rape in nizamabad) పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి... దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి  సాముహిక అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం... ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నింధితుల కోసం... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. 

ఇదీ చూడండి: 

SUICIDE ATTEMPT: అప్పుల బాధ తాళలేక... కుటుంబం ఆత్మహత్యాయత్నం

Last Updated : Sep 29, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.