ETV Bharat / city

జహీరాబాద్​లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం - gang rape

మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా అంటూ తేడా లేదు. అడపిల్ల అయితే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వివాహితపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

rape incident
వివాహితపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Sep 26, 2022, 12:37 PM IST

Gang rape of a married woman: వివాహితపై సామూహిక అత్యాచార ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శివారు గ్రామ నిర్మానుష్య ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం జహీరాబాద్-డిడిగి శివారులో మత్తులో ఉండి, అచేతన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానిక వ్యక్తి జహీరాబాద్ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

శుక్రవారం రాత్రి హౌసింగ్ బోర్డ్ ఏరియా నుంచి తీసుకొచ్చి జహీరాబాద్​ శివారు ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడి వదిలి వెళ్లినట్లు వారు గుర్తించారు. ఆమె ఆటో ఎక్కడంతో మత్తుమందు ఇచ్చారా? లేక జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తను సికింద్రాబాద్​లోని తిరుమలగిరి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన మహిళగా విచారణలో తేలింది. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్తతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బాధితురాలిని జహీరాబాద్ పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.