Minor Girl Rape case: ఆయన న్యాయశాస్త్ర పుస్తకాల రచయిత. దశాబ్దాలుగా సుజాత పబ్లిషింగ్ హౌస్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు రూపొందిస్తుంటారు. బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయ్యారు.
గాదె వీరారెడ్డి(72) బర్కత్‌పుర గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. 2010 నుంచి ఈయన ఇంట్లో ఒక మహిళ పనిచేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేట్ వద్ద ఉన్న ప్లాట్స్ వద్ద వాచ్‌మెన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆమె అక్కడ బంధువులు కొనుగోలు చేసిన ఇంట్లోకి చేరారు. టైలరింగ్ కూడా చేస్తున్నారు. న్యాయశాస్త్ర పుస్తకాలు ఉంచేందుకు అవసరమైన సంచులు కుట్టించుకునేందుకు తరచూ వీరారెడ్డి ఆమె ఇంటికి వెళ్తుండేవారు.
ఈ నేపథ్యంలో.. సెప్టెంబరులో ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె కుమార్తె(13)తో అసభ్యంగా ప్రవర్తించాడు. డిసెంబరులో మహిళ ఊళ్లో తండ్రి సంవత్సరీకంలో పాల్గొనేందుకు వెళుతూ కూతుర్ని తన సోదరుడి ఇంట్లో వదలి వెళ్లారు. అదే రోజు వారి ఇంటికెళ్లిన నిందితుడు బాలికపై మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి సమాచారమిచ్చింది. మీర్‌పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయటంతో మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, కేసు వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, దీనికి మహిళ, బంధువు వేధింపులే కారణమంటూ పేర్లు రాస్తానని బెదిరించినట్టుగా వాట్సాప్ మెస్సేజ్‌ల వివరాలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి:
Couple cheating: భార్యాభర్తల ఘరానా మోసం..అప్పు కోసం అన్నాచెల్లెళ్ల అవతారం