ETV Bharat / city

ఆ చీటీ ఉంటే హైదరాబాద్​లో 2 గంటలపాటు ఉచిత ప్రయాణం

free tsrtc bus ride స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని టీఎస్​ఆర్టీసీ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రయాణికుల వద్ద ఆ చీటీ ఉంటే రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్​ పరిధిలో ఎక్కడివరకైనా ఉచితంగా చేరుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే.

hyderabad-for-two-hours-with-medical-prescription
హైదరాబాద్​లో 2 గంటలపాటు ఉచిత ప్రయాణం
author img

By

Published : Aug 17, 2022, 4:30 PM IST

TSRTC: హైదరాబాద్​ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది.

ఆసుపత్రికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో.. ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చూపించుకోడానికి వెళ్లి.. అక్కడి వైద్యులను సంప్రదించాక తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్ఛు ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైనే సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి వీలుంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా చేరుకోవచ్ఛు

దూరప్రాంతాల నుంచి వచ్చేవారికీ.. దూరప్రాంతాల నుంచి నగరానికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఎంజీబీఎస్‌తోపాటు నగరంలో ఎక్కడ దిగినా తర్వాత 2 గంటలు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ సామ్యుల్‌ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.