రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు 82.85 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతంగా ఉండగా.. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 76 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా..
శ్రీకాకుళంలో 83.59, విజయనగరంలో 87.09, విశాఖ 86.94, తూర్పు గోదావరి జిల్లా 80.30 పశ్చిమ గోదావరి జిల్లా 83.76, కృష్ణా జిల్లా 85.64, గుంటూరు 84.92, ప్రకాశం జిల్లాలో 82.04 శాతం నమోదైంది. నెల్లూరులో 76 శాతం పోలింగ్ నమోదు కాగా.. చిత్తూరులో 78.77, కడప 85.13, కర్నూలులో 78.41, అనంతపురంలో 84.49 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
![fourth phase of panchayat elections ends in state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10719375_vote.jpeg)
ఇదీ చదవండి: