ETV Bharat / city

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ - అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్

atchannaidu
atchannaidu
author img

By

Published : Jun 13, 2020, 2:52 AM IST

Updated : Jun 13, 2020, 6:01 AM IST

02:50 June 13

అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పలు మలుపులు తిరిగిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వ్యవహారం.... ఎట్టకేలకు ఇవాళ  తెల్లవారుజామున కొలిక్కివచ్చింది. తొలుత వీడియోకాన్ఫరెన్స్‌లో... అనంతరం తన ఇంటి వద్ద విచారణ చేపట్టిన అనిశా న్యాయమూర్తి... అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు.

న్యాయవాదులను అనుమతించని పోలీసులు..

ఈఎస్​ఐ అవకవతకల కేసులో శుక్రవారం ఉదయం 7 గంటల 20 నిమిషాలకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు... రోడ్డు మార్గం ద్వారా 480 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు రాత్రి 7 గంటలకు గొల్లపూడిలోని విజయవాడ రేంజ్‌ అనిశా కార్యాలయానికి తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడుకు న్యాయసాయం అందిస్తామంటూ అక్కడికి చేరుకున్న న్యాయవాదులను సైతం పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తమను అనుమతించకపోవటంపై ఆగ్రహించిన న్యాయవాదులు... దీనిపై కోర్టులో కేసు వేస్తామని స్పష్టం చేశారు.

వైద్యపరీక్షలు..

గొల్లపూడిలోని అనిశా కార్యాలయంలో అచ్చెన్నాయుడుకు ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోసారి పరీక్షల నిర్వహణకు ఆయనతో పాటు మిగిలిన ఆరుగురు నిందితులనూ ఈఎస్​ఐ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వారిని...  విజయవాడలోని అనిశా న్యాయస్థానానికి తరలించారు. అచ్చెన్నాయుడుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు.

తెదేపా నేతల అడ్డగింత..

అనిశా న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా... అచ్చెన్నాయుడిని  పరామర్శించేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాము కేవలం పరామర్శకే వచ్చామని తెదేపా నేతలు చెప్పినా... ఎంతకీ అనుమతించలేదు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం అనంతరం లోకేశ్ సహా నేతలంతా వెనుదిరిగారు.

సుమారు 2 గంటల పాటు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అచ్చెన్నాయుడును న్యాయమూర్తి విచారించారు. అనంతరం మంగళగిరిలోని జడ్జి నివాసం వద్దకు పటిష్ఠ బందోబస్తు మధ్య ఆయనను తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. జడ్జి నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ వైపు ఎవరూ రాకుండా 100 మీటర్ల దూరం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులను సైతం రానీయకుండా అడ్డుకున్నారు. జడ్జి ఎక్కడ ఉంటే అదే తమ కోర్టు అని.... మరి తమను లోపలికి అనుమతించకపోతే ఎలా అని న్యాయవాదులు పోలీసులను ప్రశ్నించారు. న్యాయవాదులు వచ్చిన విషయాన్ని జడ్జి సిబ్బందికి తెలియచేస్తామని... అనుమతి వచ్చాకే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

కోర్టుకు నివేదిక ఇవ్వాలి..

'అచ్చెన్నాయుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం న్యాయమూర్తికి తెలిపాం. ఆసుపత్రిలో ఉంచాలని వైద్యులు సూచించారని వివరించాం. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో ఏ1 నిందితుడు రమేష్‌కుమార్‌ను రాజమండ్రి సబ్‌జైలుకు తరలించారు' -   అచ్చెన్నాయుడు న్యాయవాది వెంకటేశ్వర్లు

ఇదీ చదవండి:

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు అక్రమాల్లో అచ్చెన్నాయుడు అరెస్ట్

Last Updated : Jun 13, 2020, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.