ETV Bharat / city

బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 5 మరణాలు.. పెద్దసంఖ్యలో కేసులు - ఏపీపై బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం

రాష్ట్రాన్ని బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కూడా కొన్ని అనుమానాస్పద కేసులు కనిపిస్తున్నాయి.

black fungus
బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్
author img

By

Published : May 18, 2021, 1:37 PM IST

Updated : May 18, 2021, 8:21 PM IST

రాష్ట్రంలో ప్రబలుతున్న ప్రాణాంతక బ్లాక్‌ఫంగస్‌ ప్రజలను భయాందోళనలోకి నెట్టింది. ఒకవైపు కోవిడ్‌తో బాధపడి చికిత్స పొందేవారు కోలుకుంటున్నారని ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరగడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు అధికారికంగా 10కి పైగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఐదు మరణాలు చోటుచేసుకున్నాయి.

కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాలకు చెందిన ముగ్గురు మరణించిన వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు హైదరాబాద్, చెన్నై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్లాక్ ఫంగస్ గుప్పిట్లో చిక్కుకున్నట్లుగా కన్పిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ కేసులు క్రమంగా బయటపడుతుండటంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా కేసుల్లో కొవిడ్‌ బారిన పడి కోలుకున్న తర్వాత ముక్కు, చెవి గొంతు ద్వారా సంక్రమించే ఈ ఫంగస్‌ చివరకు వ్యక్తులకు ప్రాణంతకమవుతోంది. కరోనా తగ్గందనుకున్న వారిలో కన్ను, దవడ వాపు వంటి లక్షణాలు కొందరిలో దంత సమస్యలు వస్తున్నాయి.

బ్లాక్‌ ఫంగస్‌ గురించి తెలియని వారు హోం ఐసోలేషన్‌తో ఇంటి వద్ద చికిత్స పొందున్నారు. కాస్తంత వైద్య విషయాల పరిచయం ఉన్నవారు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా బ్లాక్‌ఫంగస్‌ సమస్యతో మరణిస్తున్న వారికి సంబంధించిన సమాచారం ప్రచారం ఈఎన్‌టీ సమస్యలు ఉన్న వారు తమకు బ్లాక్‌ఫంగస్‌ ఉందన్న భయంతో ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు.

బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి?

బ్లాక్‌ఫంగస్​ను వైద్య పరిభాషలో మ్యూకార్‌మైకోసిస్​గా చెబుతారు. కళ్లు, మెదడుపై దాడి చేసే ఈ ఫంగస్‌ సకాలంలో గుర్తించక పోతే చివరకు ప్రాణాలను హరిస్తుంది. చెవి ముక్కు, గొంతు వ్యాధులు చికిత్స నిపుణుల పర్యవేక్షణలో వ్యాధిని గుర్తించి అవసరమైన మందులు ఇస్తారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవమేనని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ ఈటీవీ భారత్‌కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఫంగస్‌ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తుందని ప్రకటించింది. బ్లాక్‌ఫంగస్‌ బాధితులు ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తెలిపారు. బ్లాక్‌ఫంగస్‌ బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వానికి తెలపాలని ఆయా నిర్వాహకులను సింఘాల్‌ కోరారు.

ఇదీ చదవండి:

'రూపాంతర వైరస్‌పై టీకాల ప్రభావం స్వల్పం'

Last Updated : May 18, 2021, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.