Treatment to Cobra: చచ్చిన పామును పట్టుకోవాలన్నా.. ముచ్చెమటలు పడతాయి చాలా మందికి. అలాంటిది.. ఓ తాచు పాముకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స అందిద్దామని ఎవరైనా అనుకుంటారా? కానీ.. ఒక వ్యక్తి మాత్రం ఆ పని చేశారు. ఆయనే.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్. ఆదివారం వనపర్తిలో ఆయన ఓ గాయపడిన నాగుపామును పట్టుకుని దానికి చికిత్స చేయించారు.
అసలేం జరిగిందంటే..?
అక్కడే పాముకు ఎక్స్రే తీయగా నడుము వద్ద ఎముకలు విరిగినట్లుగా గుర్తించారు. పశువైద్యాధికారి ఆంజనేయులు సమక్షంలో సర్పానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (సిమెంటుపట్టి) వేసి చికిత్స అందించారు. పాముకు వైద్య చికిత్స అందించిన కృష్ణసాగర్ను అందరూ అభినందించారు. సర్పాలు కనిపిస్తే తనకు సమాచారమివ్వాలని, చంపవద్దని ఆయన కోరారు. గతంలోనూ ఇలా ఒక పాము కరెంటుతీగలో చిక్కుకుంటే చికిత్స చేయించామని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: మొసలిని బంధించిన అటవీ అధికారులు..