ఆగ్రహావతి: మోదీ, అమిత్ షా మాస్కులతో రైతుల నిరసన - రాజధానిలో రైతుల ఆందోళనల వార్తలు
ఎనిమిదోరోజూ రాజధాని రైతులు రోడ్డెక్కారు. గ్రామగ్రామాన ఎక్కడికక్కడే నిరసనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాస్కులు ధరించి నిరసనలు చేపట్టారు. జీఎన్ రావు కమిటీని రద్దు చెయ్యాలంటూ యువత నినాదాలు చేశారు. రోడ్డుపైనే క్రికెట్, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, పిచ్చిబంతి, స్కిప్పింగ్ ఆడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.