ETV Bharat / city

'తెదేపాకు రాష్ట్రం ముఖ్యమైతే...వైకాపాకు కేసులే ముఖ్యం' - ఏపీ టుడే న్యూస్

గతంలో.. తెలుగుదేశం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడిందని, కానీ వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం కేంద్రం ఏం చెప్పినా తలాడిస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఎన్డీఏ జపం చేస్తున్నారని విమర్శించారు. వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా కేసులే ముఖ్యమని అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​పై అవినీతి ఆరోపణలు చేసిన వైకాపా... ఆధారాలు చూసి బోర్లా పడిందని ఆరోపించారు.

అయన్నపాత్రుడు, బుద్దా వెంకన్న
అయన్నపాత్రుడు, బుద్దా వెంకన్న
author img

By

Published : Sep 22, 2020, 6:00 PM IST

Updated : Sep 22, 2020, 10:35 PM IST

బెయిల్ కోసం గతంలో సోనియా గాంధీని ప్రాధేయపడిన జగన్... ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఎన్డీఏ జపం చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్ ఏంచేసేందుకైనా సిద్ధమని విమర్శించారు. గత విషయాలను సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోతే ఎలా దుయ్యబట్టారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ జపం చేయటం వైకాపాకు అలవాటని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అయ్యన్నపాత్రుడు  ట్వీట్
అయ్యన్నపాత్రుడు ట్వీట్

వైకాపాకు కేసులే ముఖ్యం

యూపీఏ ప్రభుత్వం ప్రణబ్‌ను రాష్ట్రపతిగా ఎన్నకున్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం రామ్​నాథ్ కోవింద్​ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు వైకాపా మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రణబ్​కు గాని, సంగ్మాకు గాని మద్దతు ఇవ్వకుండా తటస్తంగా ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే కేంద్రంలో అధికారం కూడా వద్దనుకుని బయటకు వచ్చిందన్నారు. వైకాపాకు కేసులు ముఖ్యమని.., తెదేపాకు రాష్ట్రం ముఖ్యమని తేల్చిచెప్పారు.

అయ్యన్నపాత్రుడు ట్వీట్
అయ్యన్నపాత్రుడు ట్వీట్

బురద జల్లబోయి బోర్లాపడ్డారు

లోకేశ్‌పై 2 వేల కోట్ల అవినీతి అంటూ బురద జల్లబోయి వైకాపా బోర్లాపడిందని అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. 2017 నవంబరు 14న కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా భారత్‌ నెట్‌కి సంబంధించి రాష్ట్రాల ఐటీ మంత్రులతో సమావేశం నిర్వహించాయని గుర్తు చేశారు. భారత్‌ నెట్‌ రెండో దశ ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు ఎంవోయూ చేసుకోవడానికి రాష్ట్ర ఐటీ సెక్రటరీ, ఏపీ ఫైబర్‌ ఎండీలను ఆహ్వానించాయని వెల్లడించారు. ఈ ఎంవోయూ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అప్పటి ఐటీ సెక్రటరీ విజయానంద్‌ నాటి మంత్రి నారా లోకేశ్‌ని కోరితే..., దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపి వైకాపా రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. సంబంధిత వివరాలు, ఆధారాలను అయ్యన్న తన ట్విట్టర్​లో పోస్టు చేశారు.

అది మర్చిపోతే ఎలా?

కేసుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్...ఎవరినైనా ప్రాధేయపడతారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. బెయిల్‌ కోసం సోనియాను, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు మోదీని ప్రాధేయపడుతున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్‌ ఏం చేశారో సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోతే ఎలా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : 'వైకాపా అవకాశవాద రాజకీయాలు చేస్తోంది'

Last Updated : Sep 22, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.