ETV Bharat / city

సన్న బియ్యం ఇస్తామని.. బూజు పట్టింది ఇచ్చారు: జవహర్

వంద రోజుల పాలనలో వైకాపా విఫలమైందని... మాజీ మంత్రి జవహర్ నాయుడు విమర్శించారు. సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బూజుపట్టిన బియ్యం ఇచ్చారన్నారు. బియ్యం సంచిపై పెట్టిన శ్రద్ధ... నాణ్యతపై పెడితే బాగుండేదన్నారు.

jawahar
author img

By

Published : Sep 7, 2019, 8:15 PM IST

వైకాపా పాలనలో వంద శాతం వైఫల్యాలే : జవహర్ నాయుడు

వైకాపా వంద రోజుల పాలన అధ్వానంగా ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ నాయుడు విమర్శించారు. పాదయాత్రలో ముద్దులు... ఇప్పుడు రద్దులు అనే రీతిలో వైకాపా పాలన సాగుతోందని విమర్శించారు. పశువులు కూడా తినలేని బూజుపట్టిన బియ్యాన్ని.. నాణ్యమైన బియ్యం పేరుతో శ్రీకాకుళంలో సరఫరా చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. సంచులపై పెట్టిన శ్రద్ధ బియ్యంపై పెట్టలేదని మండిపడ్డారు. అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక కమిషన్​ల పేరిట మైనారిటీలు, దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

సమావేశంలో ప్రదర్శించిన వీడియో

ఇదీ చదవండి:

సీఎంగా జగన్ అనర్హుడు: కాలవ శ్రీనివాసులు

Intro:AP_TPG_76_4_108_PINDI_VANTALU_AV_10164

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి వారం 108 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. తొలుత స్వామి వారికి 21 పండ్ల రసాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.