ETV Bharat / city

వారికి హైదరాబాద్​లో కాదు.. సొంత రాష్ట్రంలోనే క్వారంటైన్​ - ఏపీలో కొత్త క్వారంటైన్​ రూల్

విదేశాల నుంచి వచ్చే ఏపీకి చెందిన వారికి హైదరాబాద్​ క్వారంటైన్​లో ఉంచకుండా, నేరుగా రాష్ట్రానికి వచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్​లోనే 14 రోజుల క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదు.

foreign to ap quarantine
విదేశాల నుంచి నేరుగా ఏపీకే
author img

By

Published : May 18, 2020, 6:48 AM IST

విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగుతున్న ఆంధ్రప్రదేశ్‌ వాసులకు హైదరాబాద్‌లో క్వారంటైన్‌ బాధ తప్పింది. ఇక నుంచి వారందరినీ నేరుగా సొంత రాష్ట్రానికే తరలిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో విమానం దిగిన వారిని హైదరాబాద్‌లోనే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నగరంలోని పలు 2-4 నక్షత్రాల హోటళ్లలో గదుల్ని(రెండు వారాలకు రూ.15 వేలు, రూ.30వేల ప్యాకేజీలతో) బుక్‌ చేశారు.

తాజాగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కలిసి ఆంధ్రప్రదేశ్‌ వాసులను ఆ రాష్ట్రానికే పంపేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై శంషాబాద్‌కు రానున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల్ని పరీక్షల అనంతరం నేరుగా అక్కడికే తరలిస్తారు. అక్కడ రెండు వారాలపాటు నగదు చెల్లింపు(పెయిడ్‌) క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత ఇళ్లకు పంపిస్తారు. శనివారం అమెరికా నుంచి వచ్చిన 121 మంది ప్రయాణికుల్లో ఉన్న 33 మంది ఆంధ్రావాసుల్ని ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: కంటైనర్లలో కూలీలు.. పట్టించిన ఫాస్ట్​ట్యాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.