ETV Bharat / city

రహదారి కాదది.. పూల దారి

author img

By

Published : Jan 24, 2021, 7:35 PM IST

ఆ రోడ్డులో గోతులు ఉండవు. ఆ మార్గంలో వాహనాలపై వెళ్లడం కంటే, నడవడానికే అధికులు ఆసక్తి చూపుతారు. అలా నడుచుకుంటూ వెళ్లడం... ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉల్లాసాన్ని నింపుతుంది. మంచి చికిత్సతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే వైద్యుల కృషి.... పూల సువాసనలతో నిండిన రోడ్డుకు పురుడు పోసింది.

flower road attracting people
రహదారి కాదది.. పూల దారి

ఒకప్పుడు మలమూత్ర విసర్జాలు, చెత్తాచెదారాలతో నిండిన మార్గం... ఇప్పుడు ఇరువైపులా పుష్పాలు, పచ్చదనంతో నిండిపోయింది. అప్పట్లో ఆ మార్గంలో నడిస్తే జబ్బులు వస్తాయనుకునే ప్రజలు... ఇప్పుడు అదే మార్గంలో కాసేపు గడిపి మానసిక ఆరోగ్యాన్ని పొందుతున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఉన్న గంగులవారిపాలెం రోడ్డు... ఓ పర్యాటక ప్రాంతంగా మారుతోంది. రోజూ వందలాది మంది ఇక్కడ సేద తీరుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న పూల దారి

'స్వచ్ఛ సుందర చల్లపల్లి' కార్యకర్తల అవిరళ కృషితో... గంగులవారిపాలెం రోడ్డు పొదరిల్లులా మారిపోయింది. ఏడు సంవత్సరాలుగా దాదాపు వందమంది గ్రామస్థులు స్వచ్ఛతకు కృషి చేయటంతో... చల్లపల్లి జాతీయస్థాయిలో పేరు సంపాదించింది. డాక్టర్ దాసరి రామకృష్ణప్రసాద్‌... భార్య డాక్టర్‌ పద్మావతితో కలసి ఆసుపత్రి నిర్మించారు. తొలిరోజుల్లో మల విసర్జనకు అక్కడికి వచ్చే వాళ్లకు చేతులెత్తి మొక్కటంతో... క్రమంగా మార్పు సాధ్యమైంది. 'మనకోసం మనం' అనే ట్రస్టు ఏర్పాటుచేసి, విరాళాలు సేకరించారు. చల్లపల్లిలో టాయ్‌లెట్లు అందుబాటులోకి తెచ్చారు. రోడ్డు పక్క పూలమొక్కలు పెంచారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న తోటలో... చామంతి పూలకు బంతి పూలతో మేడలు కట్టినట్లుగా ఉండే దృశ్యాలు ఆకర్షిస్తున్నాయి.

ఇదీ చదవండి: తరువుకొస్తోంది తనువు.. తల్లడిల్లుతోందని 'చిన్నారి' మనువు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.