ETV Bharat / city

అంతా మనీగోడు.. ఉప ఎన్నికలో మొదలైన డబ్బు ప్రవాహం

Flow of money in munugode by elections: మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం నియోజకవర్గంలో మొదలైపోయింది. ఓటర్లను కొనుగోలు చేయడానికి డబ్బును విచ్చలవిడిగా విరజిమ్ముతున్నారు. అయితే పోలీసులు సైతం రాజకీయ పార్టీల ఆటలు కట్టించడానికి వారి పనిలో వారు ఉన్నారు. కరీంనగర్​ జిల్లా తనిఖీల్లో ఇలానే కోటి రూపాయలు పట్టుబడ్డాయి. ఇంక ఎన్నికలు మునిగిసే లోపు ఇంక ఎంత డబ్బు చేతులు మారుతుందో చూడాలి.

munugode by elections
ఉప ఎన్నికలో మొదలైన డబ్బు ప్రవాహం
author img

By

Published : Oct 18, 2022, 9:45 AM IST

Flow of money in munugode by elections: ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా పక్షం రోజుల సమయం ఉండగానే మునుగోడు నియోజకవర్గ పరిధిలో డబ్బు ప్రవాహం మొదలైంది. క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న నాయకుల కొనుగోళ్లకు ఇప్పటివరకు రూ.లక్షల్లో వెచ్చించిన ప్రధాన పార్టీలు ఇప్పుడు నేరుగా ఓటర్లకే పైసలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ మార్గాల ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నాయి. ఇలా తరలిస్తున్న భాజపా నేతకు చెందిన రూ.కోటిని పోలీసులు తాజాగా పట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి మునుగోడుకు వచ్చే వివిధ ప్రాంతాల సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేసినా కొందరు డొంకలు, ఆటోలు, బైక్​లు ద్వారా డబ్బులు నియోజకవర్గంలోని పలుప్రాంతాలకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉప ఎన్నికలో మొదలైన డబ్బు ప్రవాహం

నిఘాపెంచడంతోపాటు అన్నిపార్టీల ముఖ్యనేతల వాహనాల కదిలికలపై దృష్టి సారించారు. పోలీసులు, ప్రత్యర్థిపార్టీ నేతలు కనిపెట్టకుండా వ్యూహాత్మకంగా డబ్బుల పంపిణీ అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు తక్కువ మొత్తంలో డబ్బుఇచ్చి, మధ్యాహ్న భోజనంతోపాటూ మద్యం పంపిణీ చేసేవారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రతిగ్రామంలో ఓటర్కు ఎదుటి పార్టీ కంటే ముందే డబ్బులు ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులోభాగంగా కోట్ల రూపాయలను నియోజకవర్గానికి తరలివస్తున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

డబ్బులు దాచి వేత.. ఏళ్లుగా పార్టీ నియమావళికి బద్ధుడై, విధేయుడైన పెద్దగా జనంలో ప్రచారంలేని నాయకుల ఇళ్లలో ప్రధానపార్టీలు డబ్బులు దాస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నామినేషన్సందర్భంగా నాయకులు, కార్యకర్తల ఖర్చుల అవసరాలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ చండూరు పురపాలిక సమీపంలోని ఓ గ్రామంలో పార్టీకి చెందిన ఓ నిరుపేద వద్ద 25 లక్షలు ఉంచినట్లు తెలిసింది. ఆ విషయం సదరువ్యక్తి భార్యకు తెలియకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. ఎంతమొత్తం అనేది అతనికి చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోపార్టీ సైతం ఆ పార్టీకి ఏళ్లుగా విధేయులుగా ఓ మహిళా కార్యకర్త వద్ద 36 లక్షలు ఉంచి, నామినేషన్​ కార్యక్రమం సందర్భంగా ఎవరికి ఎంతఇవ్వాలో ఓ చీటీ రాసి ఇచ్చినట్లు తెలిసింది. ఎవరికి అనుమానంరాని కార్యకర్తలు, నాయకుల వద్ద ఓ ప్రధాన పార్టీ 10 లక్షలు తక్కువకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో డబ్బులు డంప్​ చేసినట్లు సమాచారం. గ్రామాలకు ఇన్​ఛార్జులు ఉన్న వారు తాజాగా వివిధ ఖర్చులన్నీ భరిస్తుండగా బయటినుంచి డబ్బులు వారికి అందుతున్నాయి. ఓ ప్రధానపార్టీకి చెందిన సుమారు 4.5 కోట్లను నియోజకవర్గంలోని పలుమండలాల్లో ఇప్పటి వరకు పోలీసులు సీజ్చేసినట్లు తెలిసింది. ముఖ్య నేతలు, కార్యకర్తలపై పోలీసులతోపాటు ఎన్నికల పరిశీలకుల నిఘాఉండటంతో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటుచేసి నగదు తరలిస్తున్నట్లు సమాచారం.

నెమ్మదించిన స్థిరాస్తి వ్యాపారం.. ఉపఎన్నికతో నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో పదిరోజులుగా సందడి నెలకొంది. సాధారణ రోజుల్లో తెల్లకారు కనపడని గ్రామాల్లోనూ ఇప్పుడు నిత్యం వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఏటా ఈ సమయంలో పత్తితీత, పొలంకోతలతో తీరికలేకుండా ఉండే ప్రజలు, రైతులు, మహిళలు ఈసారి పల్లెల్లోనే వివిధపార్టీలకు మద్దతుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్న సమయాల్లో గ్రామాల్లో వృద్ధులు తప్ప ఇతరులెవరూ కనపడని పరిస్థితి. మరో పదిరోజుల్లో పొలం కోతలకు వస్తుండటంతోపాటూ దీపావళి తర్వాత పత్తితీతకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్​కి దగ్గరగా ఉన్నచౌటుప్పల్, నారాయణపూర్తోపాటూ మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో సాధారణ రోజుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగేది. అక్కడ ప్లాట్లు కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వచ్చి ప్లాట్లధరలపై ఆరాతీసేవారు. అంతా ఉపఎన్నిక ప్రచారాల్లో ఉండటంతో వెంచర్లలోని ప్లాట్లను చూపించేవారే కరువయ్యారని వ్యాపారులు చెబుతున్నారు.

.

భాజపా నేత కారులో రూ.కోటి.. మునుగోడు మండలం చల్మెడ వద్ద తనిఖీల్లో భాగంగా రూ.కోటిని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న కారు కరీంనగర్‌ భాజపా కార్పొరేటర్‌ భర్తకు చెందినదిగా గుర్తించారు. ఆయనతో సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకారం నల్గొండ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ 13వ డివిజన్‌ భాజపా కార్పొరేటర్‌ చొప్ప జయశ్రీ భర్త వేణుకు చెందిన తెల్లరంగు టాటా సఫారీ కారు(నంబరు టీఎస్‌ 02 ఎఫ్‌హెచ్‌ 2425)లో నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము అనే వ్యక్తి నుంచి డబ్బు సేకరించి తీసుకొస్తున్నట్టు కారు డ్రైవర్‌ వెెల్లడించాడు. డబ్బులను సీజ్‌ చేసి, నిందితులు వేణు, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌లను అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.