తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాల నుంచి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.336 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 318.360 మీటర్లకు చేరింది. జలాశయంలో ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 2,08,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జూరాలకు పోటెత్తిన వరద
తెలంగాణ... జూరాలకు జలాశయానికి వరద పోటెత్తింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.336 టీఎంసీలుగా ఉంది.