హోటల్స్, విద్యాసంస్థలు, నివాస సముదాయాలను ఆస్పత్రులుగా మార్చే క్రమంలో... నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని... భారత అగ్నిమాపక భద్రత అసోసియేషన్ సభ్యుడు శివకుమార్ అభిప్రాయపడ్డారు.
రోగుల సంఖ్య ఎక్కువైనప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు రోగులను కాపాడే క్రమంలో రెస్క్యూ సిబ్బంది కూడా ప్రమాదంలో పడతారని తెలిపారు. విజయవాడ, అహ్మదాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదాలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఆస్పత్రులు, హోటల్స్‌లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నష్ట నివారణకు ఫైర్ కంపార్ట్మెంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా అగ్నికీలలు ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా ఫైర్ కంపార్ట్మెంటేషన్ అడ్డుకుంటుందని తెలిపారు. హోటల్స్, విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో నిపుణులైన వ్యక్తులను ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లుగా నియమించుకోవాలని సూచించారు. స్థానిక అగ్నిమాపక అధికారులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు ఆయా సంస్థల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య