ETV Bharat / city

తెలంగాణ: కాలి బూడదవుతున్నా... 'కాన'రాదా?

అడవి అంటుకుంటోంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా చిచ్చు రాజుకుంటోంది. బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 301 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఏటా మార్చిలోనే ముప్పు వాటిల్లుతోంది. 90 శాతానికి పైగా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి.

fire-accidents-in-forest-areas
కాలిబూడదవుతున్న అడవులు
author img

By

Published : Mar 19, 2020, 2:52 PM IST

అటవీ ప్రాంతాల్లో అగ్గి మంటలు ఆరడం లేదు. వేసవి పెరిగేకొద్ది అగ్నిజ్వాలల్లో అడవి దహించుకుపోతుంది. 13వ తేదీన ఈ ఏడాదిలోనే అత్యధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో 48 ప్రాంతాల్లో అడవులు కాలిపోయాయి. 18న ఈ సంఖ్య ఏకంగా ఐదున్నర రెట్లకు పైగా పెరిగింది. బుధవారం ఒక్కరోజు 301 చోట్ల అడవులు కాలిపోవడంతో అటవీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. పగలే కాకుండా ఇటీవలి కాలంలో రాత్రి సమయంలోనూ అడవికి అగ్గి అంటుకుంటోంది. దీని వల్ల రాత్రి సమయాల్లో ఆ ప్రాంతాలకు చేరుకోవడం, నిప్పుఆర్పడం క్షేత్రస్థాయి సిబ్బందికి చాలా కష్టంగా మారుతోంది.

పర్యావరణానికి తీరని నష్టం

అడవుల్లో అగ్నిప్రమాదాల కారణంగా అటవీ సంపదతో పాటు పర్యావరణానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతోంది. వన్యప్రాణులు ఆవాసం కోల్పోవడం, మంటలతో విషవాయువులు రావడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ఏడు భారీ అగ్ని ప్రమాదాల్లో ఒక్కోచోట కనీసం 10 హెక్టార్ల అడవి కాలినట్లు అంచనా.

ఉపగ్రహ పరిజ్ఞానం

అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ప్రధానంగా జనవరి - జూన్‌ వరకు జరుగుతాయి. చెట్ల నుంచి ఆకులు రాలడం ఫిబ్రవరిలో ఎక్కువ ఉంటుంది. మార్చి కల్లా నేలపై ఎండిన ఆకులు ఎక్కువగా ఉంటాయి. ఏ కొంచెం నిప్పురవ్వలు పడ్డా అడవి అంటుకుంటుంది. గడిచిన ఐదేళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే 56.7 శాతం వరకు ఒక్క మార్చి మాసంలోనే జరిగాయి. మంటలపై ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తం అవుతూ నియంత్రణ చర్యలు చేపడుతుంది.ఎస్‌ఎన్‌పీపీ ఉపగ్రహం ప్రతి 375 మీటర్ల ప్రాంతానికి ఓ చిత్రం తీస్తుంది. కిలోమీటర్‌ మేర అగ్ని ప్రమాదం విస్తరిస్తే, ఒక ప్రమాదాన్ని మూడుగా చూపిస్తుంది.

అత్యధికం భద్రాచలం జిల్లాలో

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 32,890 అగ్ని ప్రమాదాలు జరిగితే.. కేవలం ఆరు జిల్లాల్లోనే 22,582 ప్రమాదాలు జరిగాయి. వీటిలో అత్యధికంగా భద్రాద్రి-కొత్తగూడెంలో 6,277, ములుగులో 5,638, మహబూబాబాద్‌లో 2,853, కొమురంభీంలో 2,783, భూపాలపల్లిలో 2,690, నిర్మల్‌లో 2,339 ప్రమాదాలు జరిగాయి. ఉపగ్రహాల నుంచి రోజుకు 4-6సార్లు సమాచారం వస్తుంది. అటవీసిబ్బందితో పాటు, అటవీ సమీప గ్రామాల కార్యదర్శులు, ఆసక్తి ఉన్నవారు కలిపి మొత్తంగా 15 వేల మందికి ఉపగ్రహ సమాచారాన్ని పంపి అటవీశాఖ అప్రమత్తం చేస్తోంది.

ప్రమాదాలు ఎక్కడ?

కృష్ణా, గోదావరి నదీ తీరాల్లోని అటవీ ప్రాంతాల్లో అడవుల్లో రహదారులు, వంటలు చేసుకున్నచోట పశువుల కాపరులు తిరిగేచోట, ఇప్పపువ్వు, బీడీ ఆకు, తేనే సేకరణ ప్రాంతాల్లో.. ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఇవీ చదవండి:

40 గంటలు నిద్రాహారాలు లేక మనీలాలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.