దేశంలోని రైతుల ఆదాయాన్ని 2023 నాటికి రెట్టింపు చేయాలనేది ప్రధాని మోదీ సంకల్పమని... ఆ దిశగా వ్యవసాయంలో సంస్కరణ ప్రవేశపెట్టి మూడు చట్టాలను సవరించామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ చట్టాల వల్ల రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని- రైతులకు నష్టం వాటిల్లుతుందనే విపక్షాల ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ చట్టం సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అధ్యక్షతన రైతులు, రైతు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి ఏపీఎంసీలను పూర్తిగా తొలగిస్తామని చెప్పిందని, తాము వాటి విషయంలో జోక్యం చేసుకోవడం లేదన్నారు. కేంద్ర జాబితాలోని అధికారాన్ని ఉపయోగించి పంట ఉత్పత్తుల సరఫరాలో రాష్ట్రాల మధ్య అడ్డంకిగా ఉన్న ప్రతిబంధకాలను తొలగించామని తెలిపారు. చిన్న రైతుల రక్షణ కోసం పది వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని... రైతులు తమ పంటను అక్కడే నిల్వ ఉంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కరోనా కాలంలో రైతులను ఆదుకునేందుకు నాబార్డు నిర్వహణలోని గ్రామీణ బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: