రాష్ట్రంలో విట్, ఎస్‌ఆర్‌ఎం, సెంచూరియన్, భారతీయ ఇంజినీరింగ్ సైన్సు, టెక్నాలజీ ఇన్నోవేషన్(బెస్ట్) ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు(Finalization of fees for private universities) చేసింది. వర్సిటీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి వీటిని నిర్ణయించింది. విట్, ఎస్‌ఆర్‌ఎంకు గరిష్ఠంగా రూ.70 వేలు... సెంచూరియన్‌కు రూ.50 వేలుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం విడుదల కానున్నాయి(Fees are finalized for private universities in state). ఈ మూడు వర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సులు ఉండగా... బెస్ట్‌లో బీఎస్సీ వ్యవసాయ కోర్సు ఉంది. దీనికి రూ.70 వేలు ఫీజుగా నిర్ణయించారు. వీటిల్లో 35% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 2,330 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కేవలం ఇంజినీరింగ్, పార్మసీ, వ్యవసాయ కోర్సుల్లోనే 35% సీట్లను కన్వీనర్‌తో భర్తీ చేస్తారు. మిగతా కోర్సుల సీట్లను ప్రభుత్వం తీసుకోవడం లేదు.
బకాయిలు వాయిదాల్లో చెల్లించేందుకు యాజమాన్యాలకు వెసులుబాటు
విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు, వర్సిటీ ఉమ్మడి సర్వీసు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ఇంజినీరింగ్, పార్మసీ కళాశాలలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జేఎన్‌టీయూ, కాకినాడ పరిధిలో 91 ఇంజినీరింగ్, 21 ఫార్మసీ కళాశాలల బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ఇటీవల అనుబంధ గుర్తింపులు నిలిపివేసింది. 2017-18 సంవత్సరం వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని జేఎన్‌టీయూ ఆదేశించింది. ఈ ఒక్క వర్సిటీకే సుమారు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ప్రతి ఏడాది క్రమంగా ఫీజులు చెల్లించకపోవడంతో కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి.
ఒకవైపు వర్సిటీ అనుబంధ గుర్తింపు నిలిపివేయగా... మరోవైపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వాన్ని సంప్రదించాయి. 2017-18 సంవత్సరం వరకు ఉన్న బకాయిల్లో 25% చెల్లించాలని, మిగతా 75%తోపాటు 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల ఫీజులను ఎనిమిది త్రైమాసికాల్లో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 25% చెల్లించేందుకు కళాశాలలు ముందుకు రావడంతో అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. ఇది పూర్తికాగానే 91 కళాశాలల సీట్లను ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు.
ఇదీ చదవండి.
.private universities: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లు 2000