తెలంగాణలో దసరా, సద్దుల బతుకమ్మ వచ్చిందంటే చాలు... పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి చిరు వ్యాపారులు వలస వస్తుంటారు. వస్తువులు అమ్మేందుకు నానా తంటాలు పడతారు. అలాగే ఓ వ్యక్తి తన కుమారుడిని తీసుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి వచ్చాడు. పోచమ్మ చెరువు వద్ద బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారని.. కుమారుడితో కలిసి వెళ్లాడు. తన దగ్గరున్న వస్తువులు అమ్ముకున్నాడు. రాత్రి పూట అయ్యేసరికి కొడుకు నిద్ర మత్తులో తూలుతున్నాడు. విషయం గమనించిన తండ్రి తన ద్విచక్రవాహనంపైనే కుమారుడిని పడుకోబెట్టాడు. బాబుకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వస్తువులు కొనేందుకు వచ్చిన ప్రజలు బాబుని చూసి చలించిపోయారు.
ఇవీ చూడండి: ఆరేలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే