ETV Bharat / city

కుమారుడి మణికట్టు కోసి.. హతమార్చిన తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కసాయి వాడిగా మారి బిడ్డల ప్రాణాలను బలితీసుకున్నాడు. నిర్దాక్షణ్యంగా వారి మణి కట్టుకోసి ప్రాణాలు తీయాలనుకున్నాడు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో ఈ దారుణ ఘటన జరిగింది.

father killed his son
కుమారుడిని చంపిన తండ్రి
author img

By

Published : Apr 15, 2021, 4:24 PM IST

కుమారుడిని చంపిన తండ్రి

బిడ్డలను గుండెలపై పెట్టుకుని పెంచాల్సిన తండ్రి కసాయిగా మారాడు. చిన్నారుల మణికట్టును కోసి రాక్షసంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో ఓ కుమారుడు మృతి చెందగా... మరో చిన్నారి గాయాలతో బయటపడ్డాడు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన శివసంకర్​ భార్య స్వప్న మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. తాగుడుకు బానిసైన శివశంకర్‌.. ఉన్మాదిగా మారాడు.

ఉదయం 5 గంటల సమయంలో పెద్ద కుమారుడు మల్లికార్జున్, చిన్న కుమారుడు ప్రణయ్ మణికట్టు వద్ద నరం కత్తిరించాడు. పెద్ద కుమారుడు మృతి చెందగా.. కుటుంబ సభ్యులు పరిస్థితి గమనించి చిన్నబ్బాయిని ఆస్పత్రికి తరలించారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.