ETV Bharat / city

ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో..!

జాతీయ రహదారుల్లో  ప్రయాణించే వాహనదారులు టోల్​గేట్ల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.పీసీఐ) శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్​ట్యాగ్ విధానం అమల్లోకి రానుంది. ఫాస్ట్​ట్యాగ్ లేని వాహనాలకు టోల్​ప్లాజాల వద్ద చెల్లింపులకు సంబంధించి రెట్టింపు ధరలు తీసుకుంటామంటున్న ఎన్​హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో..!
ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో..!
author img

By

Published : Nov 28, 2019, 7:54 AM IST

Updated : Nov 28, 2019, 8:03 AM IST

ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో..!

ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో..!

ఇవీ చూడండి:

అక్షరం ముక్కరాదు... వ్యవసాయంలో పీహెచ్​డీ చేశాడు..!

TG_HYD_01_28_FASTAAG_F2F_PKG_3182388 reporter : sripathi.srinivas Note : టోల్ ప్లాజాలు, టోల్ ప్లాజాలపై ఆగిన వాహనాలు, దసరా, సంక్రాంతి సందర్బంగా టోల్ ప్లాజాలపై ఆగిన వాహనాల ఫైల్ విజువల్స్, జాతీయ రహదారులపై వాహనాల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) వాహనదారులు జాతీయ రహదారులపై చెల్లింపులు జరిపేందుకు టోల్ గేట్ వద్ద ఆగి మళ్లీ బయలుదేరాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొనడంతో పాటు సమయం వృధా అవుతోంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్.ఈ.టీ.సీ) కార్యక్రమానికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీసీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2104లో పైలట్ ప్రాజెక్టుగా ఫ్టాగ్ ను ప్రారంభించారు. డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ అమలులోకి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులకు సంబంధించి రెట్టింపు ధరలు తీసుకుంటామంటున్న ఎన్.హెచ్.ఏ.ఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తో ఈటీవి ముఖాముఖీ. Look... ఫాస్టాగ్ కు సంబంధించిన టాప్ సూపర్ అంశాలు : -రాష్ట్ర వ్యాప్తంగా 17 టోల్ ప్లాజాలు ఉన్నాయి. -ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్.ఎఫ్.ఐ.డీ) సాంకేతికత ఆధారంగా చెల్లిపులు జరుగుతాయి. ఆ మొత్తం లింక్ చేసిన బ్యాకు ఖాతా నుంచి లేదా కరెంట్ కాతా నుంచి జరుగుతాయి. ఫాస్టాగ్ ఆర్.ఎఫ్.ఐ.డీ ట్యాగ్ ను వాహనం ముందు భాగంలో విండ్ స్క్రీన్ (అద్దం)పై అతికించాల్సి ఉంటుంది. -ఫాస్టాగ్ బ్యాంకుల నుంచి, టోల్ ప్లాజాల వద్ద పొందవచ్చు. అందుకోసం 23 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎస్.బీ.ఐ, ఐసీఐసీఐ, హెచ్.డీ.ఎఫ్.సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.అమోజాన్ తో నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) ఒప్పందం కుదర్చుకుంది. పేటిఏంలోనూ ఫాస్టాగ్ లభిస్తోంది. -ఫాస్టాగ్ మీ బ్యాంకు ఖాతాలో జత చేసేందుకు my fastag యాప్ ను మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యను ఎంటర్ చేయడం ద్వారా సేవలను పొందవచ్చు. ఈ యాప్ ను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ ద్దవారా మీ ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవచ్చు. -ఫాస్టాగ్ ను వేరే వాహనానికి ఉపయోగించడానికి వీల్లేదు. ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా దీన్ని రూపొదించారు. -ఫాస్టాగ్ వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా 2.5 శాతం చొప్పున ప్రభుత్వం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. -ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్లినప్పుడు ట్యాక్ ఐడీతో పాటు వాహనం తరగతి, రిజిస్ట్రేషన్ నంబర్ యజమాని పేరు, ఇతర వివరాలను అక్కడుండే ఈటీసి వ్యవస్థ సేకరించి సంబంధిత బ్యాంకుకు చేరవేస్తుంది.బ్యాంకు నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్.ఈటీ.సికి) వివరాలు వెళతాయి. అక్కడ సంబంధిత వివరాలు పోలినప్పుడు నిర్థేశించిన రుసుము మొత్తం ఎన్.ఈ.టీ.సికి చేరుతుంది. -ఫాస్టాగ్ వల్ల నగదు చెల్లింపుల్లో ఇబ్బందులను అధిగమించొచ్చు. అలాగే టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కాబట్టి అటు ఇంధనం మిగలడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
Last Updated : Nov 28, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.