ETV Bharat / city

'కమిషన్​ను కలవనీయకుండా కుట్ర పన్నారు'

రాజధాని రైతుల నిరసన కొనసాగుతూనే ఉంది. రహదారి వెంబడి టెంట్ల ఏర్పాటుకు పోలీసులు అంగీకరించకపోవటం వల్ల ప్రైవేట్ స్థలంలో మందడం రైతులు ధర్నా చేస్తున్నారు. ఆదివారం జాతీయ కమిషన్ రాకతో మాయమైన పోలీసులు... నేడు భారీగా మోహరించారు.

farmers protest continues in mandadam
farmers protest continues in mandadam
author img

By

Published : Jan 13, 2020, 10:22 AM IST

మందడంలో రైతులతో ముఖాముఖి

మందడంలో 27వ రోజునా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు అనుమతి నిరాకరించటంతో ప్రైవేట్‌ స్థలంలో ధర్నా చేస్తున్నారు. నిన్న జాతీయ మహిళా కమిషన్ సభ్యుల సమయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా వృథా చేశారని రైతులు మండిపడ్డారు. గ్రామాల్లో ఏ ఒక్కరూ పండుగ చేసుకునే వాతావరణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పాదయాత్ర వారి కార్యకర్తల కోసమేనన్న మందడం రైతులు... ప్రజా సమస్యల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేస్తున్న తమని ఆయన కలవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

అమరావతిలో భారీ కట్టడాల భవిత ఏమిటి ?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.