రాష్ట్ర పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. నాగేశ్వరరావు అనే రైతు నీళ్ల ట్యాంక్ ఎక్కారు. అమరావతి కోసం 418 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూనే.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన తర్వాతే... ఆయన శాంతించి కిందకు దిగారు.
ఇదీ చదవండి: