ఇంటి నుంచి పనిచేయడం వల్ల టైమ్ చేతుల్లో ఉంటుంది అనుకుంటారు కానీ అది ఒట్టి అపోహే అంటున్నారు మానసిక విశ్లేషకులు. దీని వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతుందట. కొలీగ్స్ లేదా అధికారులతో సమావేశాల్లో పాల్గొంటే- నేరుగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఉండే సౌలభ్యం ఫోను లేదా వీడియో కాల్స్‌లో ఉండదు. వీటిల్లో ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది.
వీడియోకాల్స్‌లో ఎక్కువసేపు ముఖంలోకి చూస్తూ మాట్లాడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫలితంగా ఆందోళన పెరుగుతుంది. తప్పనిసరై ఇంటి నుంచి పని చేసేటప్పుడు- ఆఫీసు వేళల్లోనే పనిచేయాలట. అలాకాకుండా పన్నెండు గంటలపైనే పనితోనే కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పని సరిగ్గా సాగదనీ, దాంతో ఫలితం ఉండదనీ చెబుతున్నారు.
ఇదీ చూడండి: