ETV Bharat / city

మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి అవమానం.. చెత్తలో పారేశారు - ex president pranab mukherjee photo found in dustbin

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి తీవ్ర అవమానం జరిగింది. అది జరిగింది ఎక్కడో ప్రైవేటు ఆఫీసో.. పార్టీ కార్యాలయంలో కాదు సాక్షాత్తూ రాష్ట్ర సచివాలయంలోనే..! దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణణ్ ముఖర్జీ చిత్రపటాన్ని చెత్తబుట్టలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా చేయటంపై సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ex president pranab mukherjee photo
ex president pranab mukherjee photo
author img

By

Published : Dec 30, 2020, 4:04 PM IST

సాక్షాత్తూ రాష్ట్ర సచివాలయంలోనే దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి తీవ్ర అవమానం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆయన అధికారిక పర్యటనకు సంబంధించిన ఓ చిత్రాన్ని అధికారులు ఫొటో ఫ్రేముగా చేయించారు. ప్రస్తుతం దాన్ని సచివాలయంలోని నాలుగో బ్లాక్​లో చెత్తలో ఉండటం వెలుగులోకి వచ్చింది.

గతంలో ఆయన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి విశాఖ వచ్చిన సమయంలో ఆయన్ను విమానాశ్రయంలో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులు , నౌకాదళ అధికారులు ఆహ్వానిస్తున్న సమయంలో తీసిన చిత్రాన్ని సచివాలయంలో ఉంచారు. ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం ఆ చిత్రపటం చెత్తలోకి చేరింది. ఆ ఫోటోను గోడలకు తగిలించకపోయినా... కనీసం స్టోర్ లో అయినా భద్రపరచకుండా చెత్తలో పారవేయటంపై సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి అవమానం

ఇదీ చదవండి

మిషన్‌ బిల్డ్‌ ఏపీ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.