ఒకే తరహా ఆరోపణలున్నప్పుడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు సరికాదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ఉమారెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తాడిపత్రి పట్టణ, గ్రామీణ, అనంతపురం, ఓర్వకల్లు, పెద్దపప్పూరు ఠాణాల్లో నమోదు చేసిన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసుగా పరిగణించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి సోమవారం ఈ వ్యాజ్యంపై విచారించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లపై కఠిన చర్యలొద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: