ETV Bharat / city

'అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగమే రాజధాని అమరావతిని పరిరక్షిస్తుంది' - tulluru latest news

నవ్యాంధ్ర అభివృద్ధికి 3 రాజధానుల నిర్ణయం శరాఘాతమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. సంఘీభావం తెలిపారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వారికి భరోసా ఇచ్చారు.

ex minister vadde visited Amaravati and speaks on capital issue
తుళ్లూరులో రాజధాని రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
author img

By

Published : Aug 16, 2020, 5:02 PM IST

తుళ్లూరులో 243 రోజులుగా దీక్ష చేస్తున్న రాజధాని రైతుల శిబిరాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సందర్శించారు. నిరసన చేపట్టిన రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు. బాబాసాహెబ్​ అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగమే అమరావతిని పరిరక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతికి ఆమోదం తెలిపిన జగన్.. ఇప్పుడు సీఎం అయ్యాక మాట మార్చడం సబబు కాదన్నారు.

ఏనాటికీ 3 రాజధానులకు పునాదులు వేయలేరని ఆయన అన్నారు. అంతిమంగా భూమిలిచ్చిన రైతులదే విజయం ఖరారు అవుతుందని భరోసా ఇచ్చారు. సీఎం వరుస దూకుడు నిర్ణయాలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని... ఇటీవలే రాజధాని అంశం హైకోర్టు పరిశీలనలో ఉండగానే స్టేటస్​కో ఎత్తివేయాలంటూ సుప్రీంకు ఆదరాబాదరగా వెళ్లి తిరిగి వచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.