'మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు' అంటూ.. రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలు 404వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, అనంతవరం, నెక్కళ్లు, బోరుపాలెం, నీరుకొండలో ఆందోళనలు నిర్వహించారు. తుళ్లూరు రైతులకు మాజీ ఐఏఎస్ అధికారి గోపాలరావు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి జై అమరావతి అని నినాదాలు చేశారు.
విశాఖ నుంచి వచ్చిన ఓ యువకుడు అనంతవరంలో రైతులు, మహిళలతో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ నినాదాలు చేశాడు. శైవక్షేత్రంలో జరుగుతున్న శ్రీ విద్యా మహాయాగంలో మందడం మహిళలు పాల్గొని.. కుంకుమార్చన, పూజలు నిర్వహించారు. పరిపాలన రాజధానిగా అమరావతే కొనసాగాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: