ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ap elections 2021 news

.

1 pm top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Feb 9, 2021, 1:00 PM IST

  • పంచాయతీ పోరు: చిత్తూరు జిల్లా కొత్తపల్లి పంచాయతీలో ఉద్రిక్తత
    చిత్తూరు జిల్లా కొత్తపల్లి పంచాయతీలో.. కొత్తపల్లిమిట్టలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోశారని ఆరోపించటంతో.. తాత్కాలికంగా పోలింగ్ ప్రక్రియ ఆగింది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.
  • గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
    గుంటూరు జిల్లా గరికపాడులోని 3వ నంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి మృతిచెందారు. గుండెపోటు కారణంగా మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'బెదిరించానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'
    తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్​పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనపై అన్యాయంగా కేసు పెట్టి... జైలుకు పంపించారని భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్న అచ్చెన్న.. ఫోన్ రికార్డింగ్​లో తాను బెదిరించినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మార్చి 5కు వాయిదా
    అమరావతి భూముల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సిట్, కేబినెట్ సబ్‌కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదులు గడువు కోరాగా.. తదుపరి విచారణను మార్చి 5 కు వాయిదా వేసింది ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'మంచు కురవడం వల్లే జలప్రళయం'
    ఉత్తరాఖండ్​లో జరిగిన విపత్తు హిమానీనదం బద్దలవ్వడం వల్ల కాదని, భారీగా కురిసిన మంచువల్లేనని తెలిపారు ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. భారీగా కిందకు జారుకున్న మంచు.. వరదకు కారణమైందని పేర్కొన్నారు. అయితే ఇందుకు గల వాస్తవ కారణాలను కనుక్కోవాలని శాస్త్రవేత్తలను కోరినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మహారాష్ట్రలో ఖలిస్థాన్​​ ఉగ్రవాది అరెస్టు
    మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఖలిస్థాన్​ ఉగ్రవాదిని అరెస్టు చేశారు పోలీసులు. పంజాబ్​ సీఐడీ బృందం, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో ఈ ఉగ్రవాది చిక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సరికొత్త శిఖరాలకు సూచీలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​
    బడ్జెట్​ తర్వాత దేశీయ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, హెవీ వెయిట్​ షేర్ల దన్నుతో మంగళవారమూ భారీ లాభాలతో సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆ విషయంపై ఐసీసీకి దక్షిణాఫ్రికా బోర్డ్​ లేఖ
    అల్పాదాయ క్రికెట్​ బోర్డులను ప్రస్తావిస్తూ ఐసీసీకి ఓ లేఖ రాసింది దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు. ఇటీవల తమ దేశ పర్యటనను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా గురించి కూడా ఈ లేఖలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'రోజా విషయంలో ఇప్పటికీ బాధపడతా'
    ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా సెలబ్రిటీ షోకి ఇటీవల హాజరయ్యారు నటుడు సురేశ్. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మణిరత్నం 'రోజా' సినిమాలో అవకాశాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.