ETV Bharat / city

తెలంగాణ: ఈల పాటలందు సాగర్ ఈలపాట వేరయా..!

తల్లి నుంచి నేర్చుకున్న ఈల పాటతో అందరిని అలరిస్తున్నాడు... సరదాగా నేర్చుకున్న ఈల పాటతో గోల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. దాదాపు ఎవరికీ సాధ్యం కాని విధంగా ఫ్లూట్ పరికరాన్ని తలపిస్తూ ఈలపాట పాడుతున్న తెలంగాణ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సాగర్​పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

author img

By

Published : Dec 30, 2020, 4:25 PM IST

ఈల పాటలందు సాగర్ ఈలపాట వేరయా..!
ఈల పాటలందు సాగర్ ఈలపాట వేరయా..!

తెలంగాణ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చెందిన విజయ రావు- రోజ్ మేరీ దంపతుల మొదటి సంతానమైన సాగర్ స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉన్న తల్లి తన కొడుకు లోని ప్రతిభను అప్పుడే గుర్తించింది.. ఈల పాట పాడేలా మెలకువలు నేర్పించి ప్రోత్సహించింది. సరదాగా నేర్పిన ఈలపాట నేడు సాగర్​కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. సాధారణంగా పెదవులను కలుపుతూ చాలా మంది ఈల పాటలు పాడడం చూసి ఉంటాం.

కానీ సాగర్ మాత్రం అలా కాదు. ఈల పాటలు పాడుతున్నప్పుడు నాలుకను కదిలిస్తూ గాలిని వదులుతూ అచ్చం ఫ్లూట్​తో పాడినట్లు ఉండటం సాగర్ ప్రత్యేకత. అంతేకాకుండా పెదవులను కదపకుండా ఈలపాట పాడుతూ తనలోని సృజనాత్మకతను చాటుతున్నారు. ప్రస్తుతం ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు కాకుండా హిందీ ,భక్తి ,జానపదం పాటలు అవలీలగా పాడుతున్నాడు. అంతేకాకుండా మానవతా స్వచ్ఛంద సంస్థ ను స్థాపించి పేదలకు, వృద్ధులకు, అనాథ పిల్లలకు చేయూతను అందిస్తు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈల పాటలందు సాగర్ ఈలపాట వేరయా..!

ఇవీ చదవండి

'25 లక్షల ఇళ్లు ఇస్తామన్నాం.. 30 లక్షలకు పైగా ఇవ్వబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.