ETV Bharat / city

అధ్యయనం చేశాకే.. అమెరికా విద్య.. - American Educational Information

‘అమెరికాలో చదివేందుకు ఆసక్తి చూపే విద్యార్థులు కనీసం ఏడాది ముందు నుంచి వివిధ అంశాలపై విస్తృత అధ్యయనం చేయాలని ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ అధికార ప్రతినిధి ఇంగ్రిడ్‌ స్పెక్ట్‌ సూచించారు. ఖర్చులకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు లేకపోవడం లాంటి కారణాలతో ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు ఇంటర్వ్యూ దశలోనే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో 2021-22 సంవత్సరం ప్రవేశాలపై చైతన్యపరిచే ప్రక్రియకు వర్చువల్‌ ఫెయిర్‌ ద్వారా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వివిధ అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ప్రశ్నలకు ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ అధికార ప్రతినిధి మెయిల్‌ ద్వారా సమాధానాలు ఇచ్చారు.

us study
us study
author img

By

Published : Oct 5, 2020, 11:47 AM IST

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చే వారు ఎలాంటి కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు? ఇటీవల ఏమైనా మార్పులు గమనించారా?

భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు గణితం, కంప్యూటర్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ కోర్సులపై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. గత పదేళ్ల గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2018-19లో అమెరికాలో భారతీయ విద్యార్థుల రికార్డుల ప్రకారం గణితం, కంప్యూటర్స్‌లో 37 శాతం మంది చేరారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సులను 34.2 శాతం మంది ఎంచుకున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో 10.3 శాతం మంది, ఫిజిక్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులను 5.6 శాతం మంది చదివారు. హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించిన గణాంకాలు అందుబాటులో లేవు. 2009-10లో 19.8 శాతం విద్యార్థులు గణితం, కంప్యూటర్స్‌ సబ్జెక్టులకు ఎంచుకుంటే, 2018-19లో అది 37 శాతానికి పెరిగింది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫిజిక్స్‌, లైఫ్‌సైన్సెస్‌ కోర్సులకు స్వల్పంగా ఆదరణ తగ్గింది.

  • ఏమిటీ ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’..

అంతర్జాతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికా ప్రభుత్వం ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ అనే సంస్థను ప్రారంభించింది. 175 దేశాల్లో సలహాదారుల ద్వారా ఈ సంస్థ విద్యార్థులకు యూఎస్‌లో ఉన్నత విద్యపై ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తోంది. విద్యార్థులు అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల ప్రాంగణంలోని ‘అమెరికన్‌ కార్నర్‌’ కార్యాలయంలో ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ ప్రతినిధి ప్రతి గురువారం అందుబాటులో ఉంటారు.

  • అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వర్చువల్‌ ఫెయిర్‌ ఎలా ఉపయోగపడుతుందంటారు?

ప్రస్తుత కరోనా ప్రభావిత పరిస్థితుల్లో వర్చువల్‌ విధానాన్ని ఎంచుకున్నాం. ముందుగా నమోదు చేసుకున్న విద్యార్థులు ఆయా సమయాల్లో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే వివిధ వర్సిటీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలించవచ్చు. వారి కరపత్రాలను చదువుకోవచ్చు. వర్సిటీల ప్రతినిధులతోపాటు ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ సలహాదారులతోనూ అప్పటికప్పుడే మాట్లాడొచ్చు. వర్సిటీలను ఎంచుకోవడం, నిధుల సమీకరణ, దరఖాస్తు నింపడం తదితర వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

  • వైద్యారోగ్య కోర్సులకు ఎలాంటి డిమాండ్‌ ఉంది?

ఏటా వైద్యారోగ్య రంగంలో ఉన్నత విద్య చదివే భారతీయ విద్యార్థుల వాటా 3.2 శాతం వరకు ఉంటోంది. తెలంగాణ, ఏపీల నుంచి వచ్చే వారు కూడా దాదాపు ఇదే ప్రాతిపదికన ఉంటున్నట్లు మా పరిశీలనలో తేలింది.

  • దరఖాస్తుల భర్తీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

అమెరికాలో 4,500 కళాశాలలు, వందల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విద్యార్థులు వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా అమెరికాలోని బంధువులనో, ఇతరులనో సంప్రదించి కళాశాలలను ఎంచుకుంటున్నారు. కనీసం ఏడాది ముందు నుంచి ఆయా విశ్వవిద్యాలయాల తీరుతెన్నులపై అధ్యయనం చేయాలి. అక్రిడిటేషన్‌ స్థితిని తెలుసుకోవాలి. ఫీజుల చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దరఖాస్తు, ఇంటర్వ్యూలు కీలకం. దరఖాస్తును ఎలా భర్తీ చేయాలి తదితర సమాచారం కోసం in.usembassy.gov/visas/ లేదా ustraveldocs.com లను పరిశీలించవచ్చు. ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ సలహాదారులను సంప్రదించటం లేదా వారు రూపొందించిన సమాచారాన్ని అధ్యయనం చేయటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’కు చెందిన 425 మంది అంతర్జాతీయ సలహాదారులు అందుబాటులో ఉన్నారు. దిల్లీ,ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాల్లోని మా ప్రతినిధులను సంప్రదించి విద్యార్థులు అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. www.educationusa.org లేదా usiefhyderabad@usief.org.in-లను కూడా సంప్రదించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.