తెలంగాణలో.. గిరిజన జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటే... వరంగల్-మేడారం మార్గంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా పర్యటక ప్రదేశాలకు మారు పేరుగా నిలిచింది. అలాంటిది అక్కడ లక్నవరం సరస్సు వద్ద పర్యటకులకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు. మార్గమధ్యలోని రామప్ప దేవాలయాన్ని చూసేందుకు మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు. దీని వల్ల రామప్పకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్ మేడారం రహదారిలోని పర్యటక ప్రాంతాల్లోని పరిస్థితులను ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తున్న వివరాలు.
తెలంగాణలో రామప్ప చూడొచ్చు.. లక్నవరానికి అనుమతి లేదు..! - రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!
పర్యటక ప్రాంతాలకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే... మేడారం జాతర జరుగుతోంది. వరంగల్-మేడారం మార్గమధ్యలోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు ఉన్నాయి. రామప్ప ఆలయానికి అనుమతిస్తున్న పోలీసులు... భద్రతా కారణాల దృష్ట్యా లక్నవరం సరస్సును చూసేందుకు మాత్రం ఆంక్షలు విధించారు.