ETV Bharat / city

పసిగుండెలకు ప్రాణదాయని... ‘సాయి సంజీవని’ - Sai Sanjeevani Hospital in Raipur

కన్నబిడ్డకు చికిత్స చేయించే శక్తిలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈనాడు - ఈటీవీ భారత్ కథనం దిక్సూచిలా నిలిచింది. పసిగుండెకు సత్యసాయం పేరుతో వచ్చిన శీర్షిక చదివి అందులో పేర్కొన్న ఆస్పత్రికి వెళ్లగా.. వారు అక్కున చేర్చుకుని తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని ఆనందం వ్యక్తం చేశారు.

helped-in-saving-a-childs-life
helped-in-saving-a-childs-life
author img

By

Published : Feb 27, 2021, 10:15 AM IST

గుండెజబ్బులతో బాధపడే పసిహృదయాలకు ‘ఈనాడు - ఈటీవీ భారత్’ కథనం అండగా నిలిచింది. బిడ్డకు శస్త్రచికిత్స చేయించే శక్తిలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తాము ఈ కథనం చదివి ‘సాయి సంజీవని’ ఆసుపత్రిని సంప్రదించగా అక్కున చేర్చుకొని ఆపరేషన్‌ చేశారని హైదరాబాద్‌కు చెందిన బాచిన హర్ష ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఇపుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, శుక్రవారం డిశ్చార్జి అయ్యిందని.. ముంబయిలోని ఆసుపత్రి నుంచే ఆయన ఈనాడు-ఈటీవీ భారత్కు​ ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలిపారు.

హర్షది ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలోని జె.పంగలూరు. ఆయన హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. కుటుంబంతో పాటు నివసిస్తున్నారు. వారి కుమార్తె యోగ్య సుచరితకు నాలుగేళ్ల ఎనిమిది నెలల వయస్సు. గుండెజబ్బు బాధితురాలు. గుండెలో రంధ్రంతో పాటు చెడురక్తం మంచిరక్తంలో కలుస్తోందని ఇక్కడే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చూసిస్తే బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. అందుకు రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. కరోనాతో వచ్చే ఆదాయమే దిగజారిన క్రమంలో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉండగా..డిసెంబరు 26న ‘పసిగుండెకు సత్యసాయం’ శీర్షికతో ఈనాడు - ఈటీవీ భారత్లో కథనం వచ్చిందని హర్ష తెలిపారు.

అది చదివి వెంటనే రాయపుర్‌లోని సంజీవని ఆసుపత్రిని సంప్రదించగా వివరాలు నమోదు చేసుకొన్నారని చెప్పారు. కొద్ది రోజులకే ముంబయిలోని ఆసుపత్రికి రమ్మని ఫోన్‌ వచ్చిందని, వెంటనే అక్కడికి వెళ్లగా చేర్చుకొని బైపాస్‌ సర్జరీ చేశారని వివరించారు. 20 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి శుక్రవారమే డిశ్చార్జి అయ్యామని, చక్కని సేవలు ఇక్కడ లభించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే కథనం చదివి శ్రీకాకుళం నుంచి కూడా ఓ కుటుంబం గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ బాలికను ఇక్కడకు తీసుకొచ్చిందని హర్ష చెప్పారు. ఆమెకూ శస్త్రచికిత్స పూర్తయిందని, మూడు, నాలుగు రోజుల్లో డిశ్చార్జి అవుతుందని ఆయన వివరించారు. ఆసుపత్రి ప్రతినిధి సౌమ్య జంధ్యాల మాట్లాడుతూ ‘ఈనాడు’ కథనానికి స్పందించి హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ రూ.2లక్షలు విరాళంగా పంపిందని తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్​సభ స్థానంపైనే అందరి గురి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.