ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9am - ఏపీ వార్తలు

.

9am top news
9am ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 3, 2020, 9:06 AM IST

  • ఈపాస్ ఉంటేనే

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధింపు ప్రచారం నేపథ్యంలో.... ఏపీ సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్న పోలీసులు..... లేనివారిని వెనక్కి పంపుతున్నారు. పాస్‌ ఉన్నవారైనా రాత్రి 7 గంటల తర్వాత రావడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరోపణలు తగవు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై వ్యక్తిగత, అవాస్తవిక ఆరోపణలు చేయడం తగదని భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్‌ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై.. న్యాయవ్యవస్థను అవమానపరచాలనే దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఐఏఎల్‌ తీవ్రంగా ఖండించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే

వైకాపా నాయకత్వం తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తాను అగ్నిపునీతుడినై వస్తానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాను తప్ప ఆయన గురించి, పార్టీ గురించి పల్లెత్తు మాట అనలేదని గుర్తు చేశారు. ఇంకా ఏమన్నారంటే...

  • హోం క్వారంటైన్​లో ఉంటే..

కరోనా పాజిటివ్ అని తెలితే... ఇంట్లోనే ఉండి వ్యాధి నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అత్యవసర పరిస్థితులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్​కు ఫోన్‌ చేసి వైద్య సాయం పొందవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రౌడీల ఘాతుకం

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా... నిందితులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తాజ్ సందర్శన షురూ

ప్రఖ్యాత చారిత్రక కట్టడాలను జులై 6 నుంచి సందర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని తిలకించవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దివీస్​ సీఎఫ్​ఓపై ఆరోపణలు

దివీస్ లేబొరేటరీస్​కు రూ. 96.68లక్షల జరిమానా విధించింది సెబీ. సంస్థ సీఎఫ్​ఓతో పాటు మరో ఏడుగురిపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో ఈ చర్యలకు ఉపక్రమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత సైనికాధికారి ఘనత

భారత సైనికాధికారి లెఫ్ట్​నెంట్ కర్నల్​ భరత్​ పన్ను అరుదైన ఘనత సాధించారు. అత్యంత కఠినమైన రేసుల్లో ఒకటైన రేస్ అక్రాస్ అమెరికాను పూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాషింగ్టన్​లో మహాత్ముని విగ్రహం పునరుద్ధరణ

అమెరికాలోని వాషింగ్టన్​లో భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ తిరిగి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొరియోగ్రాఫర్ సరోజ్​ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. ఇటీవలే శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ ముంబయి ఓ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుఝూమున 1.52 గంటలకు గుండెపాటు రావడం వల్ల మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.