- నేడు కేబినెట్ భేటీ
వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. మొత్తం 40 అంశాల అజెండాను చర్చించి ఆమోదాన్ని తెలియజేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రత్యేక సొసైటీ
వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు ప్రత్యేక సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో కార్యకలాపాలు సజావుగా జరిగిందేకు వీలుగా ప్రత్యేక సొసైటీ ఏర్పాటుపై ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంత పని చేశావే కరోనా
నవ మాసాలు మోసి.. కన్న బిడ్డలను తనివితీర చూడక ముందే తల్లిని కరోనా కాటేసింది. అమ్మా.. అని నోరారా పిలవకముందే నవజాత శిశువులు కన్నతల్లిని కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రూ.1350 కోట్లు ఆస్తుల స్వాధీనం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అక్రమ నగదు చలామణి కేసులో నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.1350 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇందులో వజ్రాలు, ముత్యాలు, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాధ్యమేనా?
చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారతీయ పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో దీనిపై విపరీతంగా చర్చ కూడా జరుగుతోంది. అయితే చైనా ఉత్పత్తుల బహిష్కరణ అనేది సామాజిక మాధ్యమాల్లో చర్చించినంత సులువైన విషయమైతే కాదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచంపై కరోనా పంజా
ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లోనే లక్షా 34 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు చేరువైంది. 4 లక్షల 18 వేల మందికిపైగా మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అయినా వైరస్ విజృంభణ
వాతావరణంలో అధిక వేడి ఉంటే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు భిన్నంగా ఎండ ఉన్నప్పటికీ వైరస్ కేసులు పెరగడాన్ని అడ్డుకోలేదని తేల్చింది కెనడాకు చెందిన మెక్మాస్టర్ నివేదిక. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గంగూలీ కన్నా ఉత్తమ సారథులు రాలేదు
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. భారత జట్టుకు అతడి కంటే ఉత్తమ సారథులు రాలేదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దసరాకే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణ ముహూర్తం ఖరారైంది. దసరాకు చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.