ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - ap updates

..

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Apr 26, 2021, 8:58 AM IST

  • ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత.. ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం

విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక ఇద్దరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇళ్లలోనే 60 వేల మంది.. కానీ వారికి కొవిడ్ వైద్యమేది?

కరోనా సోకి.. ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి విషయంలో స్థానిక అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వీరికి అందజేయాల్సిన ఉచిత కిట్ల పంపిణీ సైతం సవ్యంగా జరగడంలేదు. రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులతో పోలిస్తే కోలుకునే వారు తక్కువగా ఉంటున్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఇళ్లలోనే ఐసొలేషన్‌లో ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ ఉక్కు ఘనత: 12 రోజుల్లో 1,300 టన్నుల ఆక్సిజన్‌

విశాఖ ఉక్కు కర్మాగారం మరో ఘనత సాధించింది. పన్నెండు రోజుల్లో 1,300 టన్నుల వైద్య ఆక్సిజన్​ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండి.. వైద్య ఆక్సిజన్​కు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరాలకు విశాఖ ఉక్కు ఆశాదీపంగా మారినట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం

శ్రీశైలం ఆనకట్ట నిర్వహణ, మరమ్మతులకు నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఫలితంగా ఆనకట్ట భద్రతా కమిటీల సూచనలు అమలు కావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు కీలక ఆనకట్ట నిర్వహణ నీరుగారుతోంది. గతేడాది మార్చి మొదటి వారంలో కేంద్రానికి చెందిన ఆనకట్టల భద్రత, నిపుణుల కమిటీ శ్రీశైలంలో పర్యటించింది. కమిటీ ఛైర్మన్‌ ఏబీ పాండ్య జలాశయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికి ఏడాది దాటినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగాల్​లో ఏడో విడత పోలింగ్ షురూ

బంగాల్​లో ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్​ స్థానమైన భవానీపుర్​ సహా 34 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు ఈ దశ బరిలో ఉన్నారు. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • వరుడికి కరోనా- పీపీఈ కిట్​ ధరించిన వధువు

కొవిడ్ వార్డే వారి పెళ్లి వేదికైంది. ఆరోగ్య సిబ్బందే పెళ్లి పెద్దలయ్యారు. పీపీఈ కిట్లు, శానిటైజర్ల సాక్షిగా.. వారిద్దరూ ఒక్కటయ్యారు. కేరళలోని అలప్పుజలో కొవిడ్ సెంటర్‌ వేదికగా ఓ యువజంట పరిణయమాడి.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'భారత్​కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం'

కరోనా మహమ్మారితో ధైర్యంగా పోరాడుతున్న భారత్‌కు అన్నిరకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. అంతకుముందు.. కొవిషీల్డ్ టీకా ముడిపదార్థాలను తక్షణమే భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే విషయంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్​తో అమెరికా భద్రతా సలహాదారు జాక్ సలివన్ ఫోన్లో సంభాషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీకి రూ.12లక్షల జరిమానా

చెన్నైతో మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్​​ కోహ్లీకి జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆస్కార్ అవార్డులు ప్రదానం

93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్​ఏంజెల్స్​లో వర్చువల్​గా ప్రారంభమైంది. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తున్నారు. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • గౌతమ్ మేనన్.. మరోసారి పోలీస్​ పాత్రలో

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాలో గౌతమ్ మేనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.