- బంగాల్, అసోంలో మొదటిదశ పోలింగ్ ప్రారంభం
బంగాల్లోని పశ్చిమ మిద్నాపూర్, ఝార్గ్రామ్ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- లారీ, ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి
లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా..ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇసుక అక్రమార్కులకు 22.50 కోట్ల జరిమానా
ఇసుకాసురులపై తూర్పు గోదావరి జిల్లా శాండ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !
రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. రూ. 86 వేల కోట్ల మేర రూపొందించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు పంపింది. గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహారాష్ట్ర ‘లేడీ సింగమ్’ దీపాలీ చవాన్ ఆత్మహత్య
ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన మహారాష్ట్ర 'లేడీ సింగమ్' దీపాలీ చవాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఐఎఫ్‌ఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. దాంతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో 500 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రైవింగ్ లైసెన్స్‌ల గడువు మరోసారి పొడిగింపు
ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్ల పునరుద్ధరణ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా సమయానికి పొందలేకపోయిన పత్రాలు జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బ్రిటన్ రకం' వైరస్ జోరుకు కారణం ఇదే..
బ్రిటన్‌లో గతేడాది డిసెంబర్లో మొదటిసారి కనిపించిన కరోనా వైరస్ రకం.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఐరోపా, బ్రిటన్‌లో రెండో విజృంభణకూ ఇది కారణమైంది. తాజాగా.. ఈ వైరస్ రకం వ్యాప్తికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్‌లోని న్యూక్లియోక్యాప్సిడ్ జన్యువులో ఒక అదనపు ఉత్పరివర్తనే.. వైరస్ వ్యాప్తికి కారణమని గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మ్యాచ్ కోసం అడవిని దాటి.. కొండను ఎక్కి!
భారత్‌లో క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు సుధీర్ కుమార్. టీమ్ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరై స్టాండ్స్‌లో అతడు చేసే సందడి అందరికీ తెలిసిందే. తాజాగా కరోనా పరిస్థితుల వల్ల భారత్-ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్‌కు ప్రేక్షకుల్ని అనుమతించలేదు. దీంతో సుధీర్‌కు మ్యాచ్ చూసే అవకాశం లేకపోయింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుంగా మైదానం దగ్గర్లోని ఓ కొండపై నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడీ సూపర్ ఫ్యాన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రంగస్థలం'లో అభిమానులు మెచ్చిన మగధీరుడు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు. 'చిరుత'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.