ETV Bharat / city

ప్రధాన వార్తలు @9 AM

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 21, 2021, 9:06 AM IST

  • రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరగనుంది. 161 మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన 3 వేల 229 పంచాయతీలకు గానూ .. ఏకగ్రీవాలు మినహా 2 వేల 743 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ పోరు: పెళ్లకూరులో వర్షంలోనే కొనసాగుతున్న పోలింగ్‌

రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాసుగుతోంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • గెలిపిస్తే ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

పంచాయతీ ఎన్నికల్లో జనాన్ని తమవైపునకు తిప్పుకోవడానికి అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా హామీలతో కూడిన బాండ్‌ పేపర్లను ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మా డాడీ ఆంధ్రాలో ఎంపీ.. అస్సలు ఫైన్ కట్టను

'రూ.3000 ఫైన్.. ఎవరిని అడుగుతున్నారు? ఇంతకీ నేనెవరో తెలుసా? మా నాన్న ఆంధ్రాలో ఎంపీ. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నాకు తెలుసు. పిలిపించమంటారా? ఇక్కడికి'.. ఇవన్నీ డ్రంక్ డ్రైవ్​లో దొరికిన ఓ యువకుడు పోలీసులతో చెప్పిన మాటలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లోయలోపడి సైనికుడి మృతి

సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సైనికుడు శుక్రవారం విధినిర్వహణలో మరణించారు. పెళ్లైన 3 నెలలకే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ హాల్​లో 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ

రాజస్థాన్‌లో ఉన్న అత్యంత పురాతన మ్యూజియం ఆల్బర్ట్ హాల్‌లోని ప్రతి కళాఖండం సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉండే 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ మాత్రం ప్రత్యేక ఆకర్షణ. పురాతన ఈజిప్టు నగరం పనోపోలిస్‌లో జరిపిన తవ్వకాలలో ఈ మమ్మీ బయటపడింది. టూటూ అనే ఓ మహిళ మమ్మీ ఇది. ఆకాలంలో ఈజిప్టులో ఖెమ్ అనే దేవుడిని పూజించేవారట. టూటూ.. ఆ పూజలు చేసే పండితుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా చెబుతారు. 1880లో ఈజిప్టు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మమ్మీని భారత్‌కు తీసుకొచ్చింది. అప్పటి నుంచీ ఆల్బర్ట్ హాల్‌లోనే భద్రపరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బయో ఆసియా సదస్సు.. జీవశాస్త్ర పరిశోదనలపై మేధో మథనం

ప్రతిష్టాత్మకమైన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021కు.. భాగ్యనగరం వేదిక కానుంది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌ వేదికగా దృశ్యమాధ్యమంలో జరగనున్న సదస్సుకు ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు.. తమ ఆవిష్కరణలు, పరిశోధనలతో హాజరుకానున్నారు. ఆరోగ్యరంగానికి కొవిడ్ విసిరిన సవాళ్లు..ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ అవకాశాలపై సదస్సులో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరువు నష్టం కేసులో 'నావల్నీ'కి జరిమానా

రష్యా ప్రతిపక్ష నేత అలెక్స్​ నావల్నీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జైలు శిక్షకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​ కొట్టివేసిన కొద్ది సమయానికే.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా విధించింది మాస్కో కోర్టు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న నేతలపై చేసిన ఆరోపణల్లో దోషిగా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచి చూస్తున్నా'

భారత జట్టు సారథి విరాట్ కోహ్లీతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆల్​రౌండర్​ రాహుల్ తెవాతియా తెలిపాడు. టెస్టు సిరీస్​ అనంతరం ఇంగ్లాండ్​తో జరగబోయే 5 మ్యాచ్​ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో రాహుల్​కు అవకాశం దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోడ్డుపక్కన తినడానికే ఇష్టపడతా: ఐశ్వర్యా రాజేశ్

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఐశ్వర్యా రాజేశ్.. తన వ్యక్తిగత ముచ్చల్ని పంచుకుంది. ఏడ్చే సన్నివేశం కోసం ఎలా సిద్ధమవుతానో అనే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆ విషయాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.