ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ap latest news

.

7pm top news
7 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 3, 2020, 6:59 PM IST

  • రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం... 48 గంటల్లో తేల్చండి
    రాజధాని వ్యవహారాన్ని ప్రజల్లో తేల్చుకుందాం.. రమ్మని వైకాపా నేతలకు చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయండని డిమాండ్ చేశారు. ఈలోపు స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకొస్తానని చెప్పారు. రాజీనామాలు చేయడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా
    వైకాపా ఎమ్మెల్యే రోజా... తితిదే నిబంధనలు ఉల్లంఘించారు. తిరుమల కొండపైకి వచ్చిన ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాజధాని అమరావతి కోసం రాష్ట్రపతిని కలుస్తా
    ప్రభుత్వాన్ని నమ్మి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వేల ఎకరాలు ఇచ్చిన రైతులను అన్యాయం చేయడం దారుణమని అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ప్రభుత్వంపై మండిపడ్డారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి లో తన సొంత ఖర్చులతో నిర్మించిన 40 అడుగుల శివుని విగ్రహాన్ని తన తండ్రితో కలిసి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమరావతికి మద్దతుగా భారీ క్రేన్​ ఎక్కి రైతు నిరసన
    మూడు రాజధానులకు నిరసనగా నేలపాడులో ఓ రైతు భారీ క్రేన్‌పైకి ఎక్కాడు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చేవరకు దిగేది లేదంటూ ఆందోళన చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత్​ దూకుడు- చైనా సరిహద్దుకు భారీ ట్యాంకర్లు
    చైనాకు దీటుగా తూర్పు లద్దాఖ్ సరిహద్దులో బలగాలను పెంచింది భారత్​. భారీ ట్యాంకర్లను తరలించింది. దౌలత్​ బేగ్​ ఒల్దీ, దేప్​సంగ్ మైదానాల్లో 17వేలమంది సైనికులను మోహరించిన డ్రాగన్​ దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే బదులిచ్చేందుకు భారత్​ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • జిమ్‌, యోగా కేంద్రాల్లో ఇక కొత్త రూల్స్
    ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో.. వీటి నిర్వహణపై విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనాకు పూర్తి స్థాయి పరిష్కారం కష్టమే: డబ్ల్యూహెచ్​ఓ
    కరోనా వైరస్​ను నిలువరించటం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్​ అభిప్రాయపడ్డారు. చాలా వాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయని.. అవి ప్రజలను ఇన్ఫెక్షన్​ నుంచి కాపాడుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పాక్​లో కరోనా తగ్గుముఖం- లాక్​డౌన్ ఎత్తివేత
    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. రోజూ లక్షల మందికి వైరస్​ సోకుతోంది. ఇప్పటివరకు 1.82 కోట్ల మందికి వైరస్ సోకింది. 6.93 లక్షల మంది మరణించారు. కొన్ని దేశాల్లో వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు అమలు చేస్తుండగా.. మరికొన్ని దేశాలు ఎత్తివేతకు ప్రయత్నిస్తున్నాయి. ​పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'ఒప్పుకుంటే సరి.. లేదంటే ఆ క్రికెటర్లు సస్పెండ్​'
    వయసు మోసాలకు పాల్పడుతున్న దేశీయ క్రికెటర్లు స్వచ్ఛందంగా బయటకు రావాలని బీసీసీఐ స్పష్టం చేసింది. తప్పు ఒప్పుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా బారినపడ్డ దర్శకుడు తేజ
    టాలీవుడ్​లో మరో దర్శకుడికి కరోనా సోకింది. ఇటీవలే ముంబయి వెళ్లి వచ్చిన తేజకు పాజిటివ్​గా తేలింది. ఆయన కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.